ఇంట్లో కూర్చొని ఫలానా వీడియో మీటింగుకి హాజరకావాల్సివస్తే ఎవరైనాసరే బెంబేలెత్తిపోతారు.ఇంట్లో సౌకర్యవంతంగా ఉన్న దుస్తులను మార్చుకుని సూట్-బూట్ ధరించి వర్చువల్ మీటింగ్‌లో కూర్చోవడానికి ఎవరు ఇష్టపడతారు? అది కూడా ఉండేది కాసేపు మాత్రమే… ఇలా ఆలోచించే వారికోసం జపాన్ కంపెనీ ఒక యాప్ (యాప్ ఫిట్స్ యు అప్ ఇన్ వర్చువల్ వార్డ్‌రోబ్) సిద్ధం చేసింది.ఇది మీరు ధరించిన పైజామాలను కూడా సూట్‌లుగా మారుస్తుంది.బెడ్‌పై కూర్చున్నప్పుడు కూడా పూర్తి కార్పొరేట్ స్టయిల్‌ను అందించడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. EmbodyMe పేరుతో ఈ యాప్‌ను టోక్యో ఆధారిత స్టార్టప్ రూపొందించింది.Nikkei Asia నివేదిక ప్రకారం, యాప్ బీటా వెర్షన్ 2020 సంవత్సరంలో ప్రారంభమైంది.
అయితే దీని తుది ఉత్పత్తి త్వరలో రానుంది.
ఈ యాప్ (EmbodyMe యాప్)కి మార్కెట్‌లో డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది.
కాబట్టి కంపెనీ దీనిని ఎన్‌క్యాష్ చేసుకోవాలనుకుంటోంది.ఈ యాప్‌లో ఎలాంటి ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
EmbodyMe యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మీరు చేయాల్సిందల్లా మీ వృత్తిపరమైన ఫోటోను అప్‌లోడ్ చేయడం.యాప్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ఆధారంగా స్టయిల్‌తో కూడిన ఫొటోను సృష్టిస్తుంది.
ఈ యాప్ ద్వారా మీకు అనేక రకాల ప్రొఫెషనల్ లుక్స్ వస్తాయి.దానిలో మీరు మీకు నచ్చిన రూపాన్ని ఎంచుకోవాలి.
ఆ తర్వాత మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, మీ యజమాని వీడియో కాన్ఫరెన్సింగ్‌లో మీరు క్లీన్ ప్రొఫెషనల్ లుక్‌తో హాజరుకావచ్చు.యాప్ ద్వారా యూజర్ ముఖంలోని 50 వేల విభిన్న పాయింట్లు ట్రాక్ చేశాక సహజ చిత్రం తెరపైకి వస్తుంది.
ఈ యాప్ జూమ్, ట్విచ్, యూట్యూబ్‌లో కూడా పని చేస్తుంది.యాప్‌లో ఎక్స్‌ప్రెషన్ కెమెరా కూడా ఉంది.
ఇది యూజర్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌ని తగిన సమయంలో పునర్నిర్వచించుకోవడానికి అనుమతిస్తుంది.అంటే ఇది ఎదుటి వ్యక్తికి ఏమాత్రం అనుమానం కలుగజేయదు.