ముహూర్తం కుదిరింది ! కొత్త మంత్రుల ఎంపికే తేలాల్సింది ?

వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ అంశం ఒక కొలిక్కి వచ్చింది .అన్ని కుదిరితే ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నట్లు గా ప్రచారమైతే పెద్దగానే సాగుతోంది.

 Ap Cabinet Expansion In April , New Cabinet Ministers, Ysp , Ap Poltics, New Cab-TeluguStop.com

ఏప్రిల్ 11వ తేదీన ముహూర్తం కూడా బాగుండడంతో,  జగన్ ఆ రోజున కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నారు.

మొదటి విడత చేపట్టిన మంత్రివర్గ విస్తరణ లోనే సామాజిక వర్గాల సమతూకాన్ని జగన్ పాటించారు.ఇప్పుడు ఏపీ క్యాబినెట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రస్తుతం మంత్రులందరినీ తప్పించి వారి స్థానంలో కొత్త మంత్రులను నియమిస్తారని,  ఇందులో ఒకరిద్దరికి మినహాయింపు ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

      ఇప్పుడు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణ లోనూ ఇదే రకమైన సామాజిక వర్గాల సమతూకాన్ని జగన్ పాటిస్తారని,  రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రులను ఎంపిక చేస్తారనేది అందరికీ తెలిసిందే.అసలు జగన్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రులను ఎంపిక చేస్తారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

దీంతో వైసిపి లోని కీలక నాయకులు చుట్టూ ఆశావాహులు ప్రదక్షిణలు చేస్తూ మంత్రివర్గంలో తమ పేరు ఉందా లేదా ?  ఉండాలంటే ఏం చేయాలి అనే అంశాలపై ఆరా తీస్తున్నారట.కానీ ఈ విషయంలో జగన్ కు తప్ప మరెవ్వరికీ క్లారిటీ లేకపోవడంతో , అంతా టెన్షన్ గానే జగన్ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. 

Telugu Ap, Ap Poltics, April, Chandra Babu, Ministers, Tdp, Ys Jagan-Latest News

    అయితే జగన్ మాత్రం రాబోయే ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు.మంత్రి పదవులు దక్కని వారు తప్పనిసరిగా అసంతృప్తి కి గురవుతారని, అందుకే వారందరినీ బుజ్జగించి కొత్త మంత్రుల పేర్లు ప్రకటించాలని చూస్తున్నారట.ఈమేరకు లిస్ట్ కూడా రెడీ చేసుకున్నట్లు సమాచారం.ప్రస్తుత మంత్రులు కొడాలి నాని తో పాటు మరో ఒకరిద్దరికి ఛాన్స్ ఉంటుందని,  మిగతా వారందరినీ జగన్ తప్పిస్తారు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ.

అయితే కొత్త మంత్రివర్గంలో తమకు స్థానం దక్కుతుందని చాలామంది ఆశలు పెట్టుకున్నారు.ఇందులో జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు ఎక్కువగా ఉన్నారు.దీంతో ఎక్కడా ఎవరికి అసంతృప్తి కలగకుండా జగన్ ఈ ఎంపికలను ఎలా పూర్తి చేస్తారో చూడాలి.     

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube