వైసీపీ మరో కొత్త కార్యక్రమం.. ఆగస్టు 15 నుంచి ప్రజాదర్బార్?

ఎన్నికలకు తగినంత సమయం ఉన్నా ప్రతిపక్షాల దూకుడుతో వైసీపీ అధినేత జగన్ కూడా ప్రజల్లోకి వస్తున్నారు.గత మూడేళ్లుగా పథకాలను ప్రారంభించడానికి తప్పితే ఆయన జనాల్లోకి వచ్చింది చాలా తక్కువ.

 Another New Program Praja Darbar Will Start Ysrcp From August 15 Andhra Pradesh,-TeluguStop.com

ఏదో కరోనా పేరు చెప్పి తాడేపల్లి ప్యాలెస్‌కే ఆయన పరిమితం అవుతూ వచ్చారు.ఇటీవల వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లాలన్న అభిప్రాయంతో గడప గడపకు కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంతోనే వైసీపీ మీద ప్రజల్లో సానుకూలత ఉందో, వ్యతిరేకత ఉందో అధికార పార్టీకి స్పష్టంగా తెలిసొచ్చింది.తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రెండోసారి అధికారంలోకి రావడానికి జగన్ అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మరో కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు.ప్ర‌జాద‌ర్బార్ అనే కార్యక్రమం ద్వారా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఆయ‌నే స్వ‌యంగా తెలుసుకోవాల‌ని సీఎం జగన్ నిర్ణ‌యించారు.

ప్రజల గోడు విన‌డం ద్వారా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని త‌ద్వారా వారు సంతృప్తుల‌వుతార‌ని భావిస్తున్నారు.

అయితే ప్రజా దర్బార్ ద్వారా సీఎం స్వ‌యంగా ప్రజల దగ్గరకు వెళ్ల‌డం.

లేదంటే ప్రజలే ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర‌కు రావ‌డం అనేది మంచి ప్ర‌య‌త్న‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.సమస్య సీఎం వద్దకు వెళ్లిన తర్వాత అధికారులు తాత్సారం చేసే అవకాశం ఉండదు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

గతంలో రచ్చబండ కార్యక్రమం చేపట్టాలని జగన్ భావించినా అది వాయిదా పడుతూ వస్తోంది.

Telugu Andhra Pradesh, Ap Poltics, August, Cm Jagan, Praja Darbar, Rachha Banda,

పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఆగస్ట్ 15 నుంచి ప్రజాదర్బార్ కార్యక్రమం మొదలవుతుందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సా.5గంటల వరకు ప్రజా దర్బార్ సాగనుందని తెలుస్తోంది.ఈ కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడమే కాకుండా మైలేజ్ కూడా దక్కుతుందని వైసీపీ నేతలు ఆశిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube