నాగార్జున ది ఘోస్ట్ గురించి ఈ సీక్రెట్ మీకు తెలుసా.. అక్కినేని ఫ్యాన్స్ కి పండుగే..!

కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వస్తున్న సినిమా ది ఘోస్ట్.ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది.

 Nagarjuna The Ghost Movie Secret Akkineni Fans Festivals Pakka , Nagarjuna , T-TeluguStop.com

గరుడవేగ సినిమాతో మెప్పించిన డైరక్టర్ ప్రవీణ్ సత్తారు తన టాలెంట్ అంతా ఉపయోగించి ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ది ఘోస్ట్ సినిమాలో ఒకటి రెండు కాదు ఏకంగా 12 దాకా యాక్షన్ సీన్స్ ఉన్నాయట.

నాగ్ కెరియర్ లో ఏ సినిమాలో కూడా ఇన్ని ఫైట్స్ లేవని తెలుస్తుంది.

అంతేకాదు 12 ఫైట్స్ కూడా ఒకదానికిమించి మరొకటి ఉంటాయని తెలుస్తుంది.

అక్కినేని ఫ్యాన్స్ కి ఈ యాక్షన్ సీన్స్ స్పెషల్ జోష్ ఇస్తాయని అంటున్నారు.నాగార్జున కూడా ఈ సీన్స్ లో అదిరిపోయే రేంజ్ లో నటించారని తెలుస్తుంది.

బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున సోలోగా సత్తా చాటాలని చూస్తున్నారు.అంతకుముందు ఆయన తీసిన మన్మథుడు 2, వైల్డ్ డాగ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి.

ఈ క్రమంలో ది ఘోస్ట్ కి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ది ఘోస్ట్ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు.

సినిమాలో సోనాలి చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది.దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు.ముఖ్యంగా ఈ సినిమాలోని ఫైట్స్ అక్కినేని ఫ్యాన్స్ కి మంచి అనుభూతిని అందిస్తాయని చెబుతున్నారు.

 ది ఘోస్ట్ సినిమాని నాగ్ చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నారని తెలుస్తుంది.ఈ సినిమాతో మరోసారి ఆయన బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube