ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్లలో యంగ్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ( Anirudh Ravichandran ) ఒకరు.19 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన తన మ్యూజిక్ తో అందరిని మ్యాజిక్ చేస్తూ సందడి చేస్తున్నారు.ఇలా సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా ఈయన సంగీతం అందిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక అనిరుద్ ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందరు.
తాజాగా ఈయన జవాన్,( Jawan ) జైలర్( Jailer ) వంటి రెండు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.ఇదిలా ఉండగా త్వరలోనే లియో సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనిరుద్ ( Anirudh Ravichandran ) తన మొదటి సినిమా విషయంలో ఎంతో బాధను అనుభవించాను అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈయన మొట్టమొదటి సినిమా త్రీ( Three Movie ) .ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ ( Danush ) శృతిహాసన్( Shruthi Hassan ) నటించినటువంటి ఈ సినిమా 2012 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు .ఇది ఆయన మొదటి సినిమా కావటం విశేషం.ఇలా తన మొదటి సినిమాలోని పాటలన్నింటినీ కూడా సిడి రూపంలో చేసే విడుదల చేయాలని మేకర్స్ భావించారు.అయితే ఈ సినిమాలో వైదిస్ కొలవరి అనే సాంగ్ లిక్ అవ్వడంతో సిడిలు చేసే అంత సమయం లేక పాటలన్నీ కూడా యూట్యూబ్లో విడుదల చేశారు.
ఇలా పాటలను సిడి రూపంలో విడుదల చేస్తే తన మొదటి సినిమాలోని పాటలను ఇలా సిడి రూపంలో తన ఫ్రెండ్స్ కి ఇవ్వాలని ఎన్నో కలలు కన్నారట అయితే ఆ కల నెరవేరకపోవడంతో ఈయన ఎంతో బాధపడ్డాను అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
.