చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.తాజాగా మురళీ మోహన్( Murali Mohan ) చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడుతూ 74 సంవత్సరాల వయస్సు ఉండి ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఆయన కామెంట్లు చేశారు.ఆదర్శ సీఎంగా బాబు పని చేశారని ఆయన అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదని చంద్రబాబు( Chandrababu Naidu ) విజన్ ఉన్న నాయకుడని మురళీ మోహన్ అన్నారు.హైటెక్ సిటీకి అవసరమైన వసతులను ముందుగానే ఊహించి ఆయన ఏర్పాటు చేశాడని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.
మైక్రో సాఫ్ట్, బిల్ల్ గేట్స్ ను హైదరాబాద్ కు( Hyderabad ) తెచ్చిన ఘనత చంద్రబాబు సొంతమని రాష్ట్రం కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం దారుణం అని మురళీ మోహన్ పేర్కొన్నారు.
ఢిల్లీ పార్లమెంట్ దగ్గర సైతం బాబు అరెస్ట్ గురించి చర్చించామని రాజ్ ఘాట్ దగ్గర వేడుకున్నామని ఆయన కామెంట్లు చేశారు.హరికృష్ణ కూతురు సుహాసిని( Suhasini ) ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారని మురళీ మోహన్ కామెంట్లు చేశారు.తాను అక్కడికి వెళుతున్నానని అరచేతితో సూర్యుడిని ఆపలేరని మురళీ మోహన్ పేర్కొన్నారు.
గ్రహణం విడిచిన వెంటనే కాంతి ఎలా ఉంటుందో అందరికీ తెలుసని ఆయన అన్నారు.
చంద్రబాబు కూడా గ్రహణం వీడి బయటకు వచ్చి రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.మురళీ మోహన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.చంద్రబాబు త్వరలో బెయిల్ పై బయటకు వస్తారేమో చూడాల్సి ఉంది.
మురళీ మోహన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.