తెలుగు సినీ ప్రేక్షకులకు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్( Anasuya ) గురించి ప్రత్యేకంగా లేదు.మొన్నటి వరకు యాంకర్ గా ప్రేక్షకులను అలరించిన అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.కాగా ఇటీవల అనసూయ రంగమార్తాండ, విమానం సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాతో పాటు తమిళ, మళయాల సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఇకపోతే యాంకర్ అనసూయ భరద్వాజ్ అందానికి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఫిట్నెస్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది అనసూయ.కాగా ఇటీవల కాలంలో అనసూయ వరుసగా సినిమా షూటింగులతో( Movie Shootings ) బిజీబిజీగా గడుపుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రస్తుతం అనసూయ నటిగా వరుసగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.దాంతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.
ఇందులో భాగంగానే పుష్ప2 మూవీ షూటింగ్ ఎక్కువగా నైట్ టైంలో జరుగుతోందంటూ అందులో తాను పాల్గొంటున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది.హెడ్ ఫోన్స్ పెట్టుకుని షూ వేసుకుని అలవాటుగా ఫోటో తీసుకుంటూ కనిపించింది.ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుని మోటివేషన్ అనేది మనల్ని మళ్ళీ స్టార్ట్ అయ్యేలా చేస్తుంది.అలవాటు అనేది నిరంతరం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది.14 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత నేను నా వర్కౌట్ ప్రాంతానికి చేరుకున్నందుకు సంతోషిస్తున్నాను.సరిగా నిద్ర లేక ఎంతో స్ట్రైన్ అవుతున్నా అని రాసుకొచ్చింది అనసూయ.