వావ్‌, ఈ యువకుడి ఐడియా సూపర్.. అతడి క్రియేటివిటీకి ఆనంద్ మహీంద్రా ఫిదా..!

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సెలబ్రిటీలకు సమానంగా ఆయనకు ట్విట్టర్‌లో ఫాలోవర్లు ఉన్నారు.

 Anand Mahindra Shares Another Amazing Video Of A Creative Boy Walking Flood Wate-TeluguStop.com

ఈ వ్యాపారవేత్తకు ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి.ప్రధానంగా ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.

విభిన్న అంశాలపై తన అభిప్రాయాలు పంచుకుంటారు.అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలుసుకుంటే.

వారికి సహాయం చేస్తారు.ఇప్పటికే ఆయన ఎందరికో సహాయం చేసి వారి జీవితాలను మార్చేశారు.

దాతృత్వంలోనే కాదు సోషల్ మీడియాలో దాగున్న క్రియేటివిటీని అందరికీ పరిచయం చేయడంలోనూ ఆనంద మహేంద్ర తర్వాతే ఎవరైనా! తాజాగా ఆయన షేర్ చేసిన మరో క్రియేటివ్ వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో కూడా ఒక అదిరిపోయే క్రియేటివిటీ ఉండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇంతకీ ఆ వీడియో ఏంటి? అందులో ఉన్న క్రియేటివిటీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ప్రస్తుతం భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో భారీ ఎత్తున వరదలు ముంచెత్తుతున్నాయి.నీటమునిగిన ప్రాంతాల్లో నివసించే వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి.

జలమయమైన రోడ్లలో బురద, పాములు, ఇంకా రకరకాల కీటకాలు ఇలా ఎన్నో ఉంటాయి.

ఇందులో వరద నీటిలో కాళ్లు పెట్టాలంటేనే భయమేస్తుంది.అయితే ఇలాంటి సమస్యకు ఓ యువకుడు ఓ అద్భుతమైన పరిష్కారం కనిపెట్టాడు.ఇతడు రెండు ప్లాస్టిక్ స్టూల్స్‌, రెండు తాళ్లతో నీటిలో కాళ్లు పెట్టకుండా సులభంగా ముందుకెళ్లే ఒక ట్రిక్‌ కనిపెట్టాడు.

వైరల్ అవుతున్న వీడియోలో అతడు ఒక స్టూల్‌ని తాడుతో ముందుకేసి దానిపై నుంచుని మళ్లీ మరొక స్టూల్‌ని మరో తాడుతో ఇంకాస్త ముందుకు పెట్టి దానిపై కాలు పెడుతున్నాడు.అలా సముద్రంలా తలపిస్తున్న నీటిలో చుక్క కూడా కాళ్లకు నీళ్లు అంటకుండా నడుస్తున్నాడు.

ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.అది ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చింది.

దాంతో అతను తన ట్విట్టర్ ఖాతాలో “అన్ని ఆవిష్కరణలకు అవసరాలే ప్రధాన మూలం” అని క్యాప్షన్‌తో షేర్ చేశారు.అది కాస్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube