నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ఆనంద్ దేవరకొండ "పుష్పక విమానం"

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం” రిలీజ్ కు రెడీ అవుతోంది.నవంబర్ 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.‘‘దొరసాని’’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘ చిత్రాల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న “పుష్పక విమానం” సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

 Anand Devarakonda pushpaka Vimanam To Be Released In Theaters On November 12 , P-TeluguStop.com

“పుష్పక విమానం” చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు.సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్‘ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు.

పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన “పుష్పక విమానం” టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది.నవంబర్ 12న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది.“పుష్పక విమానం” చిత్రంలోని కళ్యాణం కమనీయం పాట ఇప్పటికే సూపర్ హిట్టయి సినిమాకు ఆకర్షణగా నిలించింది.రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా.

డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ.”పుష్పక విమానం” ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ.ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపిస్తారు.ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామా ని గుర్తుచేస్తూ , పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది .ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం.నవంబర్ 12న థియేటర్లలో కలుసుకుందాం ” అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube