నేడు తెలంగాణకు అమిత్ షా మూడు రోజుల పాటు బిజీ బిజీ

తెలంగాణలో బిజెపి( Telangana bjp )ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా బీజేపీ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.బిజెపి ఆగ్రనేతలు వరుసగా తెలంగాణలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం చేశారు.

 Amit Shah Is Busy For Telangana Today For Three Days , Brs, Telangana Government-TeluguStop.com

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు,  బిజెపి కీలక నాయకులంతా తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కేంద్ర హోం మంత్రి అమిత్ పదేపదే తెలంగాణలో పర్యటిస్తూ ఫలితాలను తమకు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ బిఆర్ఎస్ కాంగ్రెస్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పోస్తున్నారు.

అమిత్ షా రాకతో తెలంగాణ బిజెపి నాయకులలోను ఉత్సాహం కనిపిస్తుండడం తో , ఆయన పర్యటన తమ నియోజకవర్గంలో ఉండే విధంగా బిజెపి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు .

Telugu Amit Shah, Congress, Makthalassembly, Telangana Bjp, Telangana-Politics

 ఈ క్రమంలోనే ఆయన తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించేందుకు షెడ్యూల్ రూపొందించుకున్నారు.శుక్ర, శని, ఆదివారాల్లో ఆయన రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించనున్నారు.  ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్ లో సకలజనుల విజయసంకల్ప బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు రాజేందర్ నగర్, మూడు గంటలకు శేరిలింగంపల్లి,  సాయంత్రం 4:30 గంటలకు అంబర్ పేట నియోజకవర్గల్లో( Amberpet Assembly constituency ) పర్యటించనున్నట్లు బిజెపి వర్గాలు పేర్కొన్నాయి .ఇక 25వ తేదీ ఉదయం 11 గంటలకు కొల్లాపూర్,  మధ్యాహ్నం ఒంటిగంటకు మునుగోడు,  రెండు గంటలకు పటాన్ చెరువు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు .

Telugu Amit Shah, Congress, Makthalassembly, Telangana Bjp, Telangana-Politics

26వ తేదీన ఉదయం 11 గంటలకు మక్తల్( Makthal Assembly constituency ) మధ్యాహ్నం ఒంటిగంటకు ములుగు,  మధ్యాహ్నం మూడు గంటలకు భువనగిరి , సాయంత్రం 6 గంటలకు కూకట్ పల్లి నియోజకవర్గల పరిధిలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో పాల్గొని తన ప్రసంగాన్ని వినిపించనున్నారు.  అదేరోజు రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం లో కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.దీంతో అమిత్ షా సభలు, పర్యటనలకు సంబంధించి భారీగానే బీజేపీ ఏర్పాట్లు చేపట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube