అమెరికా చరిత్రలో అత్యంత చెత్త పరిపాలన ఎవరు చేశారు అని అడిగితే అమెరికన్స్ తడుముకోకుండా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అని చెప్తారు.కేవలం అమెరికన్స్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది డోనాల్డ్ ట్రంప్ పాలనపై పెదవి విరిచే వారే.
అందుకు రీజన్ లేకపోలేదు ఏ నిర్ణయం తీసుకున్నా అది వివాదం కాకుండా ఉండేది కాదు, వ్యక్తిగత ఇగోలకు పోయి అత్యంత కీలకమైన పదవులలో ఉన్న వారిని సైతం తొలగించిన ఏకైక వ్యక్తిగా కూడా ట్రంప్ చెత్త పేరు తెచ్చుకున్నాడు.ఒకటి కాదు రెండు కాదు ట్రంప్ తీసుకున్న ప్రతీ నిర్ణయంపై అమెరికన్స్ నిప్పులు చెరిగే వారు.
ఇదిలాఉంటే.
ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అమెరికా మహిళలకు పట్టలేని కోపం తెప్పిస్తున్నాయట, పొరబాటున గనుకా ట్రంప్ కనిపిస్తే ఉతికి ఆరేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఎందుకంటే కొన్ని రోజుల క్రితం అమెరికా సుప్రీంకోర్టు అమెరికాలో మహిళల అబార్షన్ విషయంలో సంచలన తీర్పు వెల్లడించిన విషయం విధితమే.అబార్షన్ చేయించుకోవడం వారి హక్కు కాదని ఆ చట్టాన్ని కొట్టేస్తున్నట్టుగా తీర్పు చెప్పింది కోర్టు.
ఈ తీర్పుపై అమెరికా మహిళా లోకం ఒక్కసారిగా గర్చించింది.తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడింది.
రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు.చివరికి.
అమెరికా అధ్యక్షుడు బిడెన్ సైతం మహిళలకు మద్దతుగా నిలిచారు.వారి కోసం కొత్త చట్టాలని తీసుకువస్తానని హామీ ఇచ్చారు.ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు చాలా మంచిదని ఈ తీర్పును నేను ఆహ్వానిస్తూ గౌరవిస్తున్నానని ప్రకటించారు.అంతేకాదు ఈ తీర్పు ఇవ్వడం వెనుక తానే అసలు కారణమని ప్రకటించుకున్నాడు.
తాను అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలే ఈ తీర్పుకు కారణమని తెలిపారు.నేను అధికారంలో ఉండగా ఎంతో నిష్ణాతులను న్యాయమూర్తులుగా నియమించానని ఇది దేవుడి తీర్పుగా తాను భావిస్తానని తెలిపాడు.
ఈ ఒక్క ప్రకటనతో అమెరికా మహిళ లోకం ట్రంప్ పై మండిపడుతోంది.మహిళల హక్కులను గౌరవించని ట్రంప్ మరో సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడు కాడని ఫైర్ అవుతున్నారు.