తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఎంతో ఘనంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో సింగర్ రేవంత్ విజేతగా నిలిచారు.
ఈ కార్యక్రమం పూర్తి అయిన అనంతరం సీజన్ సెవెన్ గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.అయితే సీజన్ సిక్స్ కన్నా ఈ కార్యక్రమాన్ని ముందుగానే ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టారని సమాచారం.
అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ మరోసారి కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో గత కొన్ని సీజన్ల నుంచి సెలబ్రిటీ కపుల్స్ ను పంపించడం జరుగుతుంది.
సీజన్ సిక్స్ లో కూడా మెరీనా రోహిత్ దంపతులు వెళ్లారు.అయితే సీజన్ సెవెన్ లో కూడా మరొక జంటను ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్లుగా పంపించాలని నిర్వాహకులు భావించారట.
ఈ క్రమంలోనే బుల్లితెర నటీనటులుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అమర్ దీప్,తేజస్విని గౌడ దంపతులు ఈ సీజన్ లో పాల్గొనబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ వార్తలపై నటుడు అమర్ దీప్ స్పందించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్ దీప్ ను యాంకర్ ప్రశ్నిస్తూ మీరు బిగ్ బాస్ లోపాల్గొనే అవకాశం వస్తే నిజంగానే మీరు వెళ్తారా అని ప్రశ్నించగా చూద్దాం అంటూ సమాధానం చెప్పారు.ఇక మీకు తేజస్వినికి పెళ్లి అయింది కనుక మీరు ఇద్దరు సెలబ్రిటీ కపుల్స్ గా వెళ్తారని టాక్ ఉందని చెప్పడంతో ప్రస్తుతం తేజు జి తమిళ సీరియల్స్ లో నటిస్తోంది.ఇక్కడ షెడ్యూల్స్ కి అక్కడ షెడ్యూల్ కి డేట్స్ క్లాష్ అవుతాయి.కనుక సీరియల్ వదిలి రావడం కష్టమే అంటూ ఈయన చెప్పారు.డేట్స్ అడ్జస్ట్ అయితే తప్పకుండా వెళ్తారా అని మరొకసారి యాంకర్ నుంచి ప్రశ్న ఎదురుకావడంతో ఒక్కరోజు షూటింగ్లో లేకపోతేనే మాకు బ్యాటింగ్ ఉంటుంది.అలాంటిది రెండు సీరియల్స్ నుంచి తప్పుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటూ ఈ సందర్భంగా అమర్ చెప్పుకొచ్చారు.
అయితే ఈయనకి కనుక అన్ని అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా బిగ్ బాస్ వెళ్లడానికి చాలా ఆసక్తిగానే ఉన్నారని ఈయన మాటలు చూస్తే అర్థమవుతుంది.