అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం ఇక పక్కకి పోయినట్లేనా

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రామాయణం కథ వృత్తాన్ని రెండు భాగాలుగా సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు.ఈ సినిమాకి సంబంధించి రెండేళ్ల క్రితం ప్లాన్ కూడా సిద్ధం చేశారు.

 Allu Aravind Dream Project Ramayanam No Buzzing, Adi Purush Movie, Darling Praba-TeluguStop.com

ఇక ఈ రామాయణం సినిమా కోసం భారీ క్యాస్టింగ్ తీసుకోవడానికి ప్లాన్ చేశారు.ఎన్ఠీఆర్ ని రాముడు పాత్రలో ప్రెజెంట్ చేయాలని అనుకున్నారు పాన్ ఇండియా రేంజ్ లో దీనిని ఆవిష్కరించాలని కాన్వాస్ సిద్ధం చేసుకున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించి రెండేళ్లు గడిచిపోయింది.ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వినిపించడం లేదు.

నిజానికి రామాయణం అందరికి బాగా తెలిసిన కథ కాబట్టి రొటీన్ గా ఉంటుందని అప్పట్లో చాలా అభిప్రాయాలు వచ్చాయి.అయితే ఆ అభిప్రాయాలని పరిగణంలోకి తీసుకోకుండా త్రీడీలో ఈ రామాయణం కథ చెప్పాలని అల్లు అరవింద్ భావించారు.

అయితే ఇప్పుడు రామాయణం ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రామాయణం కథ ఆధారంగానే ఆది పురుష్ సినిమా ఓం రావత్ దర్శకత్వంలో చేస్తున్నాడు ఇది పూర్తిగా రామాయణం రిలేటెడ్ స్టొరీ అనే విషయాన్ని ఇప్పటికే చిత్ర దర్శకుడు స్పష్టం చేశాడు.

ఇక ఆది పురుష్ సినిమా త్రీడీలోనే తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.ఈ నేపధ్యంలో ఆది పురుష్ సినిమా తర్వాత రామాయణం కథని మళ్ళీ తెరపై ఆవిష్కరించిన అది పెద్దగా వర్క్ అవుట్ కాకపోవచ్చు.

ప్రభాస్ ని రాముడు పాత్రలో చూసిన తర్వాత మరొక స్టార్ ని ఆ పాత్రలో ఊహించుకోవడం కష్టం.దీనితో పాటు రామాయణం కథని ఎంత కొత్తగా చూపించే ప్రయత్నం చేసిన కథ పాతదే కాబట్టి జనాలు కనెక్ట్ కాకపోవచ్చు.

ఇవన్నీ ఆలోచించి అల్లు అరవింద్ రామాయణం విషయంలో వెనక్కి తగ్గి ఉంటారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube