'సడక్‌ 2' విడుదల తర్వాతా వదల్లేదు

సుశాంత్‌ మృతి కారణంగా బాలీవుడ్‌ లో స్టార్‌ వారసులు తీవ్రంగా నెపొటిజం విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఈ జాబితాలో ఆలియా భట్‌ ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.

 Alia Bhatt Sadak 2 Imdb Rating, Sadak2 Movie, Imdb Rating, Mahesh Bhatt, Sushant-TeluguStop.com

ఈమె సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ సంఖ్య లక్షల్లో తగ్గడంతో పాటు ఈమె నటించిన సడక్‌ 2 సినిమాకు చాలా గట్టి దెబ్బ తగిలింది.ముఖ్యంగా ఈమె తండ్రి మహేష్‌ భట్‌ సడక్‌ 2 సినిమాకు దర్శకత్వం వహించడం కారణంగా సుశాంత్‌ అభిమానులు ఆ సినిమాను టార్గెట్‌ చేశారు.

ఇప్పటికే సడక్‌ 2 సినిమా ట్రైలర్‌ కు ప్రంపంచంలోనే అత్యంత చెత్త రికార్డును కట్టబెట్టిన విషయం తెల్సిందే.యూట్యూబ్‌ లో దాదాపుగా మూడు మిలియన్‌ ల డిస్‌ లైక్స్‌ వచ్చాయి.

ఈ స్థాయి డిస్‌ లైక్స్‌ రావడం ప్రపంచ చకరిత్రలోనే మొదటి సారి.ఇంతగా చెత్త రికార్డును దక్కించుకున్న ఆలియా భట్‌ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

సినిమా విడుదల తర్వాత కూడా సుశాంత్‌ ఫ్యాన్స్‌ సినిమాను వదిలి పెట్టలేదు.

Telugu Aliabhatt, Imdb, Mahesh Bhatt, Nepotism, Sadak Review, Sadak, Sushanth-

సుశాంత్‌ మృతికి కారణం మహేష్‌ భట్‌ అంటూ వాదన వినిపిస్తున్న కారణంగా సడక్‌ 2 సినిమాకు ఐఎండీబీ రేటింగ్‌ కేవలం 1 నమోదు అయ్యింది.ఎంత చెత్త సినిమాలు అయినా కూడా పది రేటింగ్‌ కు కనీసం నాలుగు అయిదు రేటింగ్‌ వస్తుంది.కాని ఇండియన్‌ సినీ చరిత్రలో ఏ సినిమాకు 1 రేటింగ్‌ రాలేదు.

అది సడక్‌ 2 కు నమోదు అయ్యింది.ఇటీవలే ఒక ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాను జనాలు చూడటం లేదు అనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

మొత్తానికి ఈ సినిమాకు సుశాంత్‌ మృతి దెబ్బ గట్టిగా పడ్డట్లయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube