బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) ఆలియా భట్(Aliabhatt) జంట ఒకటి అని చెప్పాలి.వీరిద్దరూ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగడమే కాకుండా ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ఇక ఈ జంటకు ఏడాది తిరగకనే కుమార్తె కూడా జన్మించారు.ఈ చిన్నారికి రాహా (Raaha) అని నామకరణం చేసిన విషయం తెలిసిందే.
ఇలా కూతురు జన్మించిన తర్వాత అలియా భట్ సినిమాలకు కాస్త దూరమయ్యారు.ప్రస్తుతం తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నటువంటి ఈమె తాజాగా తన భర్త కుమార్తెతో కలిసి అమెరికా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా న్యూయార్కులో సందడి చేస్తున్నటువంటి అలియా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పింక్ కలర్ స్విమ్ సూట్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో( Swimming Pool ) జలకన్యల ఈమె స్విమ్ చేస్తూ కనిపించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే అలియా ఈ వీడియోని షేర్ చేస్తూ తనకు షూటింగ్ లేకపోయినా ఇంట్లో ఉన్న ప్రతిరోజు ఈ పని తప్పనిసరిగా చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఆలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకొని కెరియర్ పరంగా బిజీ అవుతున్నటువంటి తరుణంలోని ఈమెకు పాప జన్మించారు.దీంతో సినిమాలకు విరామం ప్రకటించారు.ఇక ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే ఈమె తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ( RRR) సినిమాలో సీత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.
దీంతో ఈమెకు తెలుగులో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.