తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి( Alekhya Reddy ) సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుందనే సంగతి తెలిసిందే.తారకరత్న మరణం తర్వాత అలేఖ్యారెడ్డి తన మనస్సులోని అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
అలేఖ్యా రెడ్డి ఉగాది పండుగను గ్రాండ్ గా జరుపుకోగా ఈ వేడుకలకు విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావిస్తూ అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
మా జీవితంలో నాన్నలాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అంకుల్ అని ఆమె పేర్కొన్నారు.ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయని అలేఖ్యారెడ్డి చెప్పుకొచ్చారు.కష్టసుఖాలలో మా వెంటే ఉంటూ ధైర్యం చెప్పే వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఆమె అన్నారు.ఎన్నికలతో విశ్రాంతి లేకుండా ఉన్నా మాకోసం విజయసాయిరెడ్డి స్పెషల్ గా రావడాన్ని మించిన సంతోషం లేదని అలేఖ్యారెడ్డి పేర్కొన్నారు.
ఇలాంటి సమయంలో మాతో ఉంటే ఆ విలువేంటో ఆయనకే తెలుసని అలేఖ్యారెడ్డి చెప్పుకొచ్చారు.ఉగాది పండుగ ( Ugadi festival )రోజును మాకు స్పెషల్ గా మార్చిన విజయసాయిరెడ్డి అంకుల్ పై మా ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.అలేఖ్యారెడ్డి వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అలేఖ్యకు ఇన్ స్టాగ్రామ్ లో 1,30,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.అలేఖ్యకు తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ చెబుతున్నారు.
అలేఖ్యా రెడ్డి తన పిల్లలు కెరీర్ పరంగా ఎదగటం కోసం ఎంతో కష్టపడుతున్నారు.పిల్లలకు ఆర్థికంగా, ఇతర ఇబ్బందులు రాకుండా ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అలేఖ్యారెడ్డి భవిష్యత్తులో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో తెలియాల్సి ఉంది.
బాలయ్య సైతం అలేఖ్య కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ విషయంలో బాలయ్యను సైతం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.