అల వైకుంఠపురములో.. ఇన్ని కాపీ పేస్టులా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో మరో రెండు రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Ala Vaikuntapuramulo Mixture Of Few Telugu Movies-TeluguStop.com

ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.అయితే త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రంపై కాపీ వివాదాలు ఎలాగైతే వచ్చాయో, ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంపై కూడా అదే తరహా వివాదం ఒకటి ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అల వైకుంఠపురములో సినిమా కోసం త్రివిక్రమ్ ఏమంత కష్టపడి కథను రెడీ చేయలేదని, సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఇంటి గుట్టు’ అనే సినిమా కథను కాస్త అటుఇటు చేసి ప్రెజెంట్ చేస్తున్నాడంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతేగాక అజ్ఞాతవాసిలోని కొన్ని సీన్స్‌ను ఉన్నదిఉన్నట్లుగా దించేశాడట త్రివిక్రమ్.

ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్‌ను కాపీ కొట్టి అజ్ఞాతవాసి చిత్రం తెరకెక్కించారంటూ ఆ చిత్ర దర్శకుడు అప్పట్లో వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా మరోసారి ఆ దర్శకుడిని ట్వీట్ చేస్తూ ఓ నెటిజన్ ‘ఈసారి మీ లార్గోవించ్ చిత్రాన్ని మరో అవతారంలో చూడండి’’ అంటూ కామెంట్ పెట్టాడు.

ఇది కాస్త ఆ దర్శకుడి కంట పడటంతో ‘అదిరిపోయింది.లార్గో ఫ్రీమేక్ అనే అవార్డును క్రియేట్ చేద్దాం’ అంటూ సెటైరిక్‌గా రీట్వీట్ చేశాడు.

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్‌లో మరోసారి ఆందోళన మొదలైంది.ఇది కూడా అజ్ఞాతవాసి బాపతు సినిమానేనా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.ఏదేమైనా ఒక్క సినిమాను స్పూర్తిగా తీసుకుని చేస్తే పర్లేదు కానీ ఇన్ని సనిమాలను స్పూర్తి తీసుకున్నామంటే, అది వినడానికే కాస్త విడ్డూరంగా ఉందని అంటున్నారు సినీ క్రిటిక్స్.మరి అల వైకుంఠపురములో చిత్రం అసలు సిసలు త్రివిక్రమ్ కథనా, లేక కాపీ పేస్ట్ చేసిన కథనా అనేది సినిమా చూస్తేనే చెప్పగలం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube