ఆ నిర్మాతను రిస్క్ లో పెడుతున్న అఖిల్..?

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్, బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అదృష్టం ఉంటే మాత్రమే సక్సెస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.ఆరు నెలల వయస్సులోనే సిసింద్రి అనే సినిమాలో నటించి హిట్ కొట్టిన అఖిల్ పెద్దయ్యాక మాత్రం హీరోగా ఒక్క హిట్ కూడా లేకపోవడంతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు.

 Akhil And Surendar Reddy Movie Budget More Than 40 Crore Rupees, Akhil, Surende-TeluguStop.com

టాలెంట్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లోనే నటిస్తున్నా అఖిల్ నటనకు ప్రశంసలు దక్కుతున్నా సినిమాలు కమర్షియల్ సక్సెస్ కావడం లేదు.

వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన అఖిల్ కు ఆ సినిమా ఫలితం భారీ షాక్ ఇచ్చింది.

మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా బడ్జెట్ లో సగం కూడా రికవరీ చేయలేకపోయింది.మనం, 24 లాంటి హిట్ల తరువాత విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది.

తొలిప్రేమ సినిమాతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాలో నటించగా ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

Telugu Akhil, Akhilsurendar, Anil Sunkara, Budget, Surender Reddy-Movie

ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా బడ్జెట్ కూడా అంచనాల కంటే 25 శాతం ఎక్కువే అయిందని తెలుస్తోంది.అయితే ఈ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది.

దాదాపు 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని.అనిల్ సుంకర ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

అయితే అఖిల్ పై అంత బడ్జెట్ పెడితే అదే స్థాయిలో రికవరీ ఉంటుందా.? అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.మరోవైపు సినిమాలంటే మాస్ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపరు.దీంతో ఆఖిల్ తన సినిమాతో నిర్మాత అనిల్ సుంకరను రిస్క్ లో పెడుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube