కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం తునీవు.ఈ సినిమాకు హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాను ఈ స్టూడియోస్‌తో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమాలో అజిత్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఆ పోస్టర్ లో అజిత్ ఒక పొడవాటి కూర్చిలో కూర్చొని గన్ పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.అలాగే కళ్లద్దాలు పెట్టుకొని తెల్ల గడ్డం మంచి హెయిర్ స్టైల్స్ తో లుక్ లో కాస్త స్టైలిష్ గా కనిపిస్తున్నాడు అజిత్.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ అభిమానులు అజిత్ వకీల్ సాబ్ నుంచి కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేయడం మొదలుపెట్టారు.వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వ్యాన్ లో చేర్ల కూర్చుని కాళ్లు చాపి బుక్స్ చదువుతూ ఉంటాడు.
అయితే సేమ్ దానిని అచ్చు గుద్దినట్లు అజిత్ కాపీ చేశాడు అంటూ అజిత్ పై ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ అభిమానులు.
అజిత్ కీ సంబంధించిన పోస్టర్ ని, పవన్ కళ్యాణ్ పోస్టర్ నీ పక్కపక్కన పెట్టి సేమ్ టు సేమ్ ఉన్నాయి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఆ ఫోటోలను బట్టి చూస్తే అజిత్ కాపీ చేసినట్టుగానే తెలుస్తోంది.ఈ విషయంపై పలువురు స్పందిస్తూ పోస్టర్లు కాపీ కొట్టడం కాకుండా సరికొత్తగా ఆలోచించండి అంటూ సలహాలు ఇస్తున్నారు.
మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ అలాగే హీరో అజిత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.కాగా ఈ మధ్యకాలంలో ఇలా పలువురు హీరోలు ఇతర హీరోల సినిమాల నుంచి కొన్ని సన్నివేశాలను కూడా కాపీ కొట్టారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.