తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు.స్టార్ హీరోయిన్స్ అందరు కూడా ఇతర భాషలకు చెందిన వారే.
తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఏ ఒక్కరు వారిని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.ఒక వేళ వారికి తెలుగు సినిమా ల్లో ఆఫర్లు వచ్చినా కూడా చిన్నా చితకా సినిమాల్లో లేదా బి గ్రేడ్ పాత్రల్లో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి.
తెలుగు అమ్మాయిలు వేరే భాషల్లో మంచి గుర్తింపు దక్కించుకుని సక్సెస్ లు దక్కించుకున్నారు.కాని తెలుగు లో వారే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ దక్కించుకున్న దాఖలాలు అస్సలు లేవు.
అంజలి తెలుగు అమ్మాయి.ఆమె తమిళ నాట మంచి విజయాలను సొంతం చేసుకుంది.
తెలుగు లో ఆమెను జనాలు ఆధరించినా కూడా ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం ఆమెను పట్టించుకోలేదు.ఇప్పుడు కౌశసల్య కృష్ణమూర్తి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ ను తెలుగు ఫిల్మ్ మేకర్స్ పక్కకు పెట్టారు.
ఆమె పుట్టి పెరిగింది పూర్తిగా తమిళనాడులో అయినా కూడా ఆమె మూలాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినవి కావడంతో.తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ ఉండటం వల్ల టాలీవుడ్ లో మినిమం గా కూడా ఆఫర్లు రావడం లేదు.
తెలుగు అమ్మాయి అనే ఒకే ఒక్క కారణం వల్ల ఆమెను తప్పిస్తున్నారు.తాజాగా ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు చూస్తే అయిన వారికి కాస్త ఈమెపై ఆసక్తి కలుగుతుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇంత అందంగా ఉన్న ఐశ్వర్య రాజేష్ ను మన వాళ్లు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు అంటూ ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.