ఎఫ్‌3 : దిల్‌ రాజు సూపర్ ప్లాన్‌, భారీ వసూళ్లు పక్కా

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ అంచనాల నడుమ ఇప్పుడు ఎఫ్‌ 3 సినిమా రూపొందింది.

 Dil Raju Master Plan For F3 Movie Release Details, Dil Raju, F3 Movie, Varun Tej-TeluguStop.com

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఎఫ్ 3 ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా ఎఫ్ 3 సినిమా ను ఫ్యామిలీ ఆడియన్స్ కు రీచ్‌ అయ్యే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.

సోషల్‌ మీడియా ద్వారా యూత్‌ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా ప్లాన్ చేశారు.

మొత్తంగా ఎఫ్‌ 3 సినిమా ను ఎక్కువ మంది చూసే విధంగా ఒక సేఫ్ డేట్‌ లో అన్ని అనుకుని దిల్‌ రాజు విడుదల చేయబోతున్నాడు.

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటీ అంటే ఎఫ్ 3 సినిమా కు సోలో రిలీజ్ దక్కింది.ఈ మద్య కాలంలో భారీ బడ్జెట్‌ సినిమాలకు తప్ప ఏ మీడియం రేంజ్ సినిమా లకు చిన్న సినిమాలకు సోలో రిలీజ్ దక్కలేదు.

కాని ఎఫ్ 3 కోసం దిల్‌ రాజు మాస్టర్ ప్లాన్‌ వేసి మరే సినిమా ను కూడా ఈనెల 27న విడుదల కాకుండా ప్లాన్ చేశాడు.

ఇప్పుడు పెద్ద సినిమా ల హడావుడి కూడా ఏమీ లేదు.

Telugu Dil Raju, Dil Raju Master, Anil Ravipudi, Solo, Varun Tej, Venkatesh-Movi

గతంలో విడుదల అయిన సినిమా ల వల్ల ఏమైనా పోటీ ఉంటుందా అంటే అది కూడా లేదు.తదుపరి వారం కూడా ఎక్కువ పోటీ ఉండబోదు.కనుక రెండు వారాల పాటు ఎఫ్ 3 సినిమా థియేటర్లలో కుమ్మేయడం ఖాయం అంటున్నారు.మినిమం గా ఉంది.యావరేజ్ గా ఉంది అనే టాక్‌ వస్తే ఖచ్చితంగా అద్బుతమైన వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎఫ్ 2 దాదాపుగా వంద కోట్లు వసూళ్లు చేసింది.

కనుక ఎఫ్‌ 3 ఖచ్చితంగా 150 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube