ChatGPTతో వర్క్ చేసే టైప్‌ రైటర్‌ ఇదే… అద్భుతమైన అనుభవం అంతే!

ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా వినబడుతున్న పేరు ChatGPT.అవును, ChatGPT పేరు ఆన్లైన్ సర్కిల్స్ లో మారుమ్రోగిపోతోంది.

 Chatgptతో వర్క్ చేసే టైప్‌ రైటర్‌ -TeluguStop.com

సాధారణంగా మనం టైప్ రైటర్ సహాయంతో పనిచేయాలంటే, మనకు టైపింగ్ ఖచ్చితంగా రావాలి.అయితే ఇక్కడ ఈ ఫొటోలో కనిపిస్తున్న టైప్ రైటర్ తో టైప్ చేయాలంటే, మనకు టైప్ రాకున్నా ఏం ఫర్వాలేదు.

ఇది తనంతట తానే టైప్ చేసేయగలుగుతుంది.అవును, ఇది పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ టైప్ రైటర్.

దీనికి ChatGPT ద్వారా మార్గనిర్దేశనం చేస్తే చాలు.ఎలాంటి సాయం లేకుండానే పని పూర్తి చేస్తుంది.

Telugu Aipowered, Chat Gpt, Chatgpt Robots, Chatgpttype, Ghost Writer, Tech, Typ

ప్రస్తుతం కేరళకు చెందిన డిజైనింగ్ నిపుణుడు, ఇంజనీర్ అరవింద్ సంజీవ్ ఈ టైప్ రైటర్ కి రూపకల్పన చేశారు.విలక్షణంగా పనిచేసే ఈ టైప్ రైటర్ పనికి తగినట్లే దీనికి ‘ఘోస్ట్ రైటర్’ అని పేరు పెట్టడం జరిగింది.OLED స్క్రీన్, రెండు నాబ్స్, తేలికగా వాడుకునేందుకు వీలయ్యే కీబోర్డ్ ఈ టైప్టర్ కి ప్రధాన ఆకర్షణలు.దీనిని ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదు.త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.కాబట్టి మీరు సిద్ధంగా వుండండి.

ఇకపోతే ChatGPT సాయంతో రోబోలను కంట్రోల్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Telugu Aipowered, Chat Gpt, Chatgpt Robots, Chatgpttype, Ghost Writer, Tech, Typ

ఇక ఈ క్రమంలో కొన్ని సానుకూల ఫలితాలు కూడా వచ్చినట్టు తాజాగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.ChatGPT రోబోలు, డ్రోన్లను కంట్రోల్ చేసేలా టెస్టులు చేసారు.ప్రస్తుతానికి వాటిలో మెరుగైన ఫలితాలు కూడా వచ్చినట్లు చెప్పుకొస్తున్నారు.

ఒక రోబో చేతిని కంట్రోల్ చేసేలా ChatGPT సూచనలు చేయగా.మైక్రోసాఫ్ట్ లోగోని అది సెట్ చేసిందంట.

దానికి వారు స్టన్ అయ్యారు.అలాగే ChatGPTకి సుదీర్ఘంగా కోడ్ రాయగల సత్తా ఉందనే విషయం అందరికీ విదితమే.

ఇప్పుడు ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఆబ్జక్ట్ డిస్టన్స్ డేటాకు అనుమతులు ఇచ్చి దాని సామర్థ్యాన్ని పరీక్షించారు.అప్పుడు చాట్ జీపీటీ ఎంతో సమర్థంగా కోడ్ జనరేట్ చేసిందంట.

రోబోలను కంట్రోల్ చేసేందుకు ముఖ్యంగా పైథాన్ లో కోడ్ రాస్తున్నట్లు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube