టాలీవుడ్ హీరో అడివి శేష్( Adivi Sesh ) గురించి మనందరికీ తెలిసిందే.ఇప్పటిక వరకు అడివి శేష్ హీరోగా నటించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.
ఇకపోతే గత ఏడాది హిట్ 2 సినిమాతో( Hit 2 ) ప్రేక్షకులను పలకరించాడు అడివి శేష్.ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
అడివి శేష్ హిట్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు.వరుస సినిమాలతో బాగా అలసి పోయిన అడివి శేష్ ఏకంగా ఏడాది సమయం పాటు బ్రేక్ తీసుకున్నాడు.
అయితే కావాలని తీసుకున్నాడా లేదంటే ఇతర కారణాల వల్ల బ్రేక్ వచ్చిందా అనేది తెలియదు కానీ ఏడాది పాటు అడవి శేష్ సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నాడు.
అప్పుడప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో కనిపించినా కూడా షూటింగ్ లు చేయక పోవడంతో ఈ ఏడాది ఆయన సినిమాలు ఏవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేదు.అయితే ఎట్టకేలకు ఈ విలక్షణ హీరో రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నాడు.ఇప్పటికే ప్రకటించిన గూఢచారి 2( Goodachari 2 ) సినిమా ఒకటి కాగా, మరొకటి లవ్ స్టోరీ సినిమా.
( Love Story Movie ) ఈ రెండు సినిమాలు కూడా సమాంతరంగా షూటింగ్ జరుగబోతున్నాయి.ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో కొద్దిపాటి గ్యాప్ లో రాబోతున్నాయట.
మొత్తానికి అడివి శేష్ అభిమానులకు కచ్చితంగా ఇది శుభవార్త.ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా అడివి శేష్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులకు వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.అంతేకాకుండా ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్గా నిలుస్తాయి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అడివి శేష్ గూఢచారి 2 సినిమా ఆసక్తికర స్పై థ్రిల్లర్( Spy Thriller ) గా ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.ఇక మరో సినిమా విషయానికి వస్తే.
ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ తో రూపొందబోతుంది.ఒకే సారి రెండు విభిన్నమైన జోనర్స్ లో సినిమాలు చేస్తున్న అడివి శేష్ వచ్చే ఏడాది తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఈ విషయంపై అడివి శేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.