అమ్మమ్మ చేసిన దారుణం.. 37 ఏళ్ల తర్వాత చైనీస్ కపుల్‌కు విముక్తి..?

దుఃఖం అనేది ఒక క్లిష్టమైన భావన.ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు.

 After 37 Years Of The Atrocity Committed By The Grandmother, The Chinese Couple-TeluguStop.com

ఒకసారి బాగున్నట్లు అనిపిస్తుంది, అంతలోనే తీవ్రమైన దుఃఖం కలుగుతుంది.అంటే, దుఃఖం అనేది అలల లాగా వస్తుంది.

ఒక బిడ్డను కోల్పోయినప్పుడు కూడా దుఃఖం అనేది అప్పుడప్పుడు వచ్చి బాధ పెడుతుంది.కొంతమందికి ఆ దుఃఖం జీవితాంతం ఉండిపోతుంది.

చైనీస్ దంపతులు( Chinese couple ) కూడా 37 ఏళ్లుగా ఇలాంటి దుఃఖాన్ని అనుభవించారు.చివరికి వారు తమ బిడ్డను కలుసుకోగలిగారు.

వివరాల్లోకి వెళ్తే, చైనా దేశం, షాన్‌షీ ప్రాంతం, వీనాన్ ( Shaanxi region, Weinan )అనే చిన్న పట్టణంలో 1986 సంవత్సరంలో ఒక మహిళకు కుమారుడు జన్మించాడు.ఆ కుటుంబానికి ఇది మూడవ సంతానం.

ఆ బిడ్డ అమ్మమ్మ కుమారుడిని తల్లిదండ్రుల నుంచి వెంటనే వేరు చేసింది.ఆ బిడ్డను జావు అనే వ్యక్తికి ఇచ్చివేసింది.

జావు కుటుంబంలోనే పెంచాలని అమ్మమ్మ నిర్ణయించుకుంది.అయితే, తమ కొడుకును ఇవ్వడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

కానీ, వారికి తెలియకుండా అమ్మమ్మ ఈ నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నందున మూడవ బిడ్డను పెంచడం కష్టమవుతుందని భావించి, వారి తరపున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమ్మమ్మ చెప్పింది.

Telugu Child, Chinese, Son, Grandmother, Nri, Chinese Freed-Telugu NRI

ఆ బాలుడి తల్లిదండ్రులకు జావు అనే వ్యక్తి చైనా తూర్పు భాగంలోని శాండాంగ్ ( Shandong )ప్రాంతానికి చెందిన వాడిని మాత్రమే తెలుసు అతని అడ్రస్ అతని ఎలా ఉంటాడో కూడా వీళ్ళకి తెలియదు.అమ్మమ్మ చనిపోయిన తర్వాత, తండ్రి లీ, ఆయన భార్య తమ కొడుకును వెతుకుతూ 30 ఏళ్లు కుమారుడి కోసం వెతికారు.పోలీసుల దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం, ఫిబ్రవరి నెలలో ఆ దంపతుల రక్త నమూనాలు, శాండాంగ్ ప్రాంతంలోని జావోజువాంగ్‌లో నివసిస్తున్న పాంగ్ అనే వ్యక్తి రక్త నమూనాలతో సరిపోయాయి.

Telugu Child, Chinese, Son, Grandmother, Nri, Chinese Freed-Telugu NRI

2009లో, చైనా పోలీసులు తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, తమ నిజమైన తల్లిదండ్రులను వెతుకుతున్న పిల్లల రక్త నమూనాలను సేకరించి, ఒక పెద్ద డేటాబేస్‌ను తయారు చేశారు.షాన్‌షీ పోలీసులు లీ, ఆయన భార్య, పాంగ్ అనే వ్యక్తిని ఇద్దరూ రక్తం ఇవ్వమని అడిగారు.అలా చేయడం ద్వారా వారు అసలు తల్లిదండ్రులే అని నిర్ధారించుకున్నారు.

పోలీసుల సహాయంతో పాంగ్ తన జన్మస్థలమైన వీనాన్‌కు వెళ్లి తన తల్లిదండ్రులను ఆగస్టు 3న కలిశాడు.ఆ సమయంలో వారు చాలా ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube