కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి.అవి చాలా మంచి స్టోరీ, కొత్త కాన్సెప్ట్‌తో వచ్చి ఆకట్టుకుంటాయి.
సినిమా మొదలు చివరి వరకు బాగానే ఉంటాయి కానీ ఒట్రెండు సన్నివేశాలు మాత్రం అస్సలు మెప్పించలేవు.అవి బాగా డిసప్పాయింట్ చేస్తాయి.
ఆ సన్నివేశం ఒక్కటి లేకపోతే ఈ మూవీ సూపర్ గా ఉండేది అని థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ప్రేక్షకుడు అసంతృప్తితో బయటకి వస్తుంటాడు.అలా ప్రేక్షకుల్లో తీవ్రమైన అసంతృప్తి నింపిన కొన్ని సినిమా సన్నివేశాలు ఉన్నాయి.ఆ సీన్లు ఏవో తెలుసుకుందాం.
• గజిని
A.R.మురుగదాస్( A.R.Murugadoss ) దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గజిని ( Gajini )ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఈ చిత్రంలో కల్పన (అసిన్) తాను ప్రేమించిన సంజయ్ రామస్వామి (సూర్య) పేదవాడు కాదని, చాలా పెద్ద వ్యాపారవేత్త అని తెలుసుకోకుండానే చనిపోతుంది.తాను ఎవరి పేరు అయితే చెప్పుకొని అందరి ముందు షో చేసిందో ఆయనే దిగివచ్చి తనను ప్రేమిస్తున్నాడని తెలుసుకోలేక పోతుంది.
ఈ సన్నివేశం చాలామందిని డిసప్పాయింట్ చేసింది.ఈ ఒక్క విషయం తెలిసి ఉంటే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయి ఉండేదని అనుకున్నారు కానీ డైరెక్టర్ మాత్రం ఆ సంగతి తెలియకుండానే ఆ క్యారెక్టర్ చంపేశాడు.
• కేజిఎఫ్ 2
కన్నడ పిరియడ్ యాక్షన్ ఫిలిం కేజిఎఫ్ 2లో( KGF 2 ) ఫాతిమాగా నటి ఈశ్వరీరావు( Ishwari Rao ) నటించిన సంగతి తెలిసిందే.అయితే ఈమె తన కొడుకు ఫర్మాన్( Furman ) (శరణ్ శక్తి) చనిపోయినప్పుడు హిందీలో ఓ డైలాగ్ చెప్పి తెలుగు ప్రేక్షకులను బాగా డిసప్పాయింట్ చేసింది.దీనికి అర్థం ఏంటో తెలియక ఆడియన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
• రాధే శ్యామ్
ఇండియన్ పీరియడ్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ “రాధే శ్యామ్” ( Radhe Shyam )రూ.200-350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.అయితే పెట్టిన పెట్టుబడి కంటే ఇది ఎక్కువ కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
ప్రభాస్, పూజా హెగ్డే ( Prabhas, Pooja Hegde )హీరో హీరోయిన్లగా నటించారు.ఇది కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి.
ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ చివర్లో ప్రభాస్‌కి ముఖం పైన రక్తాలు కారుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ సినిమా మొత్తం కూడా ఈ సన్నివేశం ఎక్కడా కనిపించదు.దీనివల్ల ఫాన్స్ చాలా ఆ డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశారు.
దీంతోపాటు 7G బృందావని కాలనీ సినిమాలో హీరోయిన్ చనిపోవడం కూడా చాలా మందిని తీవ్ర నిరాశకు గురి చేసింది.