తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి రాధ (Radha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి రాధ ఇండస్ట్రీకి ఎన్ని రోజుల పాటు దూరంగా ఉన్న తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించారు.బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి పలు డాన్స్ షోలకు ఈమె జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రాధా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈమె వారసురాలుగా తన కుమార్తెలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె కార్తిక (Karthika) జోష్, దమ్ము వంటి సినిమాలలో నటించారు.అయితే హీరోయిన్ గా ఈమె పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి బిజినెస్ రంగం వైపు అడుగులు వేశారు.బిజినెస్ రంగంలో మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు.
ఇలా బిజినెస్ ఉమెన్ గా ( Business Women ) ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి కార్తిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈమె నిశ్చితార్థం( Engagement ) చేసుకున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో రాధ షేర్ చేశారు.
ఇలా కుటుంబ సభ్యులు సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నటువంటి కార్తీకంలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రాధా తన కుమార్తె పెళ్లి పనులలో బిజీ అయ్యారు త్వరలోనే తన కుమార్తె పెళ్లి జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈమె ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రిటీలు అందరిని కూడా తన కుమార్తె పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.తాజాగా దర్శకేంద్రుడికి రాఘవేంద్రరావు(Raghavendra Rao) ని కూడా ఈమె కలిసి తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించారని తెలుస్తోంది.ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చాలా రోజుల తర్వాత కలవడం సంతోషంగా ఉందని చెప్పడమే కాకుండా తన కుమార్తె పెళ్లికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాఘవేంద్రరావు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.