తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.
లక్ష్మీ కళ్యాణం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.తెలుగులోప్రభాస్, రామ్ చరణ్, రానా, మహేబాబు, చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్.
ఇక కెరియర్ బాగా పిక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి( Kajal Marriage ) చేసుకుని సెటిల్ అయ్యింది.ప్రస్తుతం కాజల్ కి ఒక బాబు కూడా ఉన్నాడు.అయితే పెళ్లి అయినప్పటికీ కాజల్ జోష్ ఏ మాత్రం తగ్గడం లేదు.ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ అదరగొడుతోంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది.ఇకపోతే కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలయ్య బాబు నటిస్తున్న భగవత్ కేసరి( Bhagavath Kesari ) సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే సత్యభామ( Satyabhama ) అనే లేడీ ఓరియేంటెడ్ సినిమాలో కూడా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్ పుట్టినరోజు( Kajal Aggarwal Birthday ) సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.అందులో కాజల్ పవర్ ఫుల్ పాత్రలో నటించింది.ఈ చిత్ర యూనిట్ కాజల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు.
తాజాగా కాజల్ 37వ ఏటా అడుగుపెట్టింది.దీంతో సత్యభామ చిత్ర యూనిట్ కాజల్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీస్ కారు మాదిరి కేక్( Police Car Model Cake ) ను తయారు చేయించి కట్ చేయించడం ఆసక్తికరంగా మారింది.ఇందుకు కాజల్ చాలా సంతోషించింది.
ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ.సాధారణంగా తన పుట్టిన రోజుకు వెకేషన్ కు, ఏదైనా స్పెషల్ ప్లేస్ కు వెళ్లడం, ట్రావెలింగ్ లాంటి ప్లాన్స్ ఉంటాయని తెలిపింది.
కానీ ఈసారి చిత్ర యూనిట్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టు ఆమె తెలుస్తోంది.తన జీవితంలో ఇలా ఫస్ట్ టైమ్ పుట్టిన రోజు జరుపుకున్నట్టు ఆమె తెలిపింది.
అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది కాజల్.కాగా కాజల్ సత్యభామ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వబోతుందని తెలుస్తోంది.