అప్పటినుంచి నేనంటే పవన్ కు కడుపుమంట.. పోసాని షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీ నాయకులకు కోపం వచ్చిన సంగతి తెలిసిందే.ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో కొంతమంది పవన్ ఫ్యాన్స్ పోసానిని టార్గెట్ చేస్తూ ఆయనకు మెసేజ్ లు పెట్టారు.

 Actor Posani Krishna Murali Shocking Comments About Pawan Kalyan, Pawan Kalyan,-TeluguStop.com

పవన్ ఫ్యాన్స్ అలా చేయడంతో పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతూ ఒక సినిమా విషయంలో తనకు, పవన్ కు గొడవైందని తెలిపారు.

పవన్ కళ్యాణ్ అప్పటినుంచి తనపై కోపం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

తనకు ఒక్కరే భార్య ఉన్నారని పవన్ కు ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారని పోసాని అన్నారు.పవన్ ఒక సైకో అని ఫ్యాన్స్ ను అదుపులో పెట్టుకోవాలని పోసాని కృష్ణమురళి సూచనలు చేశారు.

ఇతర హీరోల ఈవెంట్లకు పవన్ తన అభిమానులను పంపి పవన్ నామ జపం చేయిస్తారని పోసాని కృష్ణమురళి వెల్లడించడం గమనార్హం.

Telugu Pawan Kalyan, Posanikrishna, Tollywood-Movie

సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో రాత్రి షూటింగ్ చేయాల్సి వచ్చిందని సాయంత్రం 6 దాటితే తాను షూటింగ్ లో పాల్గొననని అయితే పవన్ పెద్ద హీరో కాబట్టి రాత్రి 9 గంటల వరకు ఎదురు చూశానని పోసాని చెప్పుకొచ్చారు.ఇంటికి వెళ్లి భోజనం చేస్తున్న సమయంలో పవన్ ఫోన్ చేసి చెప్పకుండా ఎలా వెళ్లిపోతారని తనపై కేకలు వేశారని రాత్రి 10 గంటలకు నువ్వు వస్తే అప్పటివరకు వేచి చూడాలా? అని ప్రశ్నించడంతో ఆ మూవీ నుంచి తనను తొలగించారని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.ఆ సంఘటన జరిగినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు తానంటే కడుపుమంట అని పోసాని కామెంట్లు చేశారు.

మంచు విష్ణు నామినేషన్ వేయడానికి వెళ్లిన సమయంలో కూడా కొంతమంది పవన్ ఫ్యాన్స్ అంటూ హంగామా చేశారని పోసాని కృష్ణమురళి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube