లిఫ్ట్ ఎక్కిన బాలికను దారుణంగా కరిచేసిన కుక్క.. వీడియో వైరల్..

ఇటీవల కాలంలో కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి.కొన్నిసార్లు మనుషుల తప్పుల వల్ల కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నారు.

 A Video Of A Dog Biting A Girl In A Lift Has Gone Viral, Viral News, Noida Lift,-TeluguStop.com

కుక్కలు చిన్నారులను ఈజీ టార్గెట్ గా భావిస్తూ అటాక్స్ చేస్తున్నాయి.ఇటీవల నోయిడాలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ లో ఇలాంటి ఒక ఉదాంతం వెలుగు చూసింది.

లోటస్ 300 సొసైటీలోని లిఫ్ట్‌లో( Lotus 300 ) ఎక్కిన ఓ చిన్న బాలికపై కుక్క దాడి చేసింది.

ఈ ఘటన మే 3న జరిగింది.

ఇది ఆలస్యంగా బయటికి వచ్చింది.ఒక వీడియోలో ఈ దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

వీడియోలో చూసినట్లుగా బాలిక ఒంటరిగా లిఫ్ట్‌లో ఉంది.హఠాత్తుగా, లిఫ్ట్‌ డోర్లు తెరుచుకుంటాయి, ఒక కుక్క లోపలికి పరుగులు తీసి బాలిక కుడి చేతిని కొరికేసింది.

కుక్క యజమాని వెంటనే లోపలికి వచ్చి కుక్కను బయటకు తీసుకువెళతాడు.బాలిక నొప్పితో బాధపడుతూ, తన చేతిని పట్టుకుంటూ ఉంటుంది.

త్వరగా లిఫ్ట్‌ డోర్లు మూసుకోవడానికి బటన్లు నొక్కుతుంది.కుక్క మళ్లీ లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ సరిగ్గా ఆ సమయానికి డోర్లు మూసుకుపోతాయి.వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎక్కువ మంది ఒకే ప్రదేశాన్ని వాడే చోట్ల కుక్కలకు తాడు కట్టాలని, లేదంటే వాళ్ళ యజమానులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

కఠినమైన నిబంధనలు అవసరం అని పేర్కొన్నారు.నోయిడాలో ఫ్లాట్‌ ఓనర్ల గుంపుకు నాయకత్వం వహిస్తున్న రాజీవ్ సింగ్ ( Rajiv Singh ) కఠినమైన నిబంధనలు ఉండాలని అంటున్నారు.

తాడు వాడకుండా కుక్కలను తిప్పే వారికి భారీ జరిమానాలు వేయాలని ఆయన అభిప్రాయం.

నోయిడాలో ఇలా కుక్కలు కరవడం కొత్తేమీ కాదు.జనవరిలో గౌర్‌ సిటీ 2 లోని గెలాక్సీ రాయల్ సొసైటీలో( Galactic Royal Society in Gaur City 2 ) ఒక వ్యక్తిని జర్మన్ షెపర్డ్ ( German Shepherd ) కుక్క బాగా కరిచింది.పోలీసులు కుక్క యజమానిపై కేసు పెట్టారు.

అంతకు ముందు అక్టోబర్‌లో, సెక్టార్ 108లోని లారెల్ సొసైటీ అనే ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో , ఒక రిటైర్డ్ అధికారి కుక్కతో లిఫ్ట్‌ లో ఉండటానికి ఇష్టపడక, కొంతమందితో వాగ్వాదానికి దిగారు.ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, కుక్కలను బయట తిప్పేటప్పుడు తప్పనిసరిగా తాడు వాడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube