వచ్చే సోమవారం ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.ఈ శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.
ఇప్పటి వరకు మారుమోగిన మైకులు ఇక మూగబోతున్నాయి.ప్రజలను ఆకట్టుకునే విధంగా తమ ప్రసంగాలతో ఓదరగొట్టిన రాజకీయ నాయకులంతా సైలెంట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది.
ఇంకా ఎన్నికల ప్రచారానికి మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో, అన్ని పార్టీలు హడావుడి మరింతగా పెంచాయి.జనాలకు దగ్గర అయ్యేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాయి.
సభలు, సమావేశాలు, రోడ్ షోల పేరుతో ఆయా పార్టీల అధినేతలు, కీలక నాయకులంతా నిత్యం జనాల్లోనే ఉంటున్నారు.తీరిక లేదన్నట్లుగా పూర్తిగా ఎన్నికల ప్రచారంలోని నిమగ్నం అవుతున్నారు.
ఒకవైపు వైసీపీ అధినేత జగన్ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ, సభల్లో పాల్గొంటూ జనాలకు వైసిపి( YCP ) ప్రభుత్వ హయాం లో జరిగిన మేలును, మళ్లీ అధికారంలోకి వస్తే ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తామో చెబుతూ మరోసారి అవకాశం ఇవ్వాలంటూ జనాలను కోరుతున్నారు.కూటమి తరపున టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ), జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో పాటు, బిజెపి నేతలు ఎన్నికల ప్రచారాలను మరింత ముమ్మరం చేశారు.
బిజెపి అగ్ర నేత, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహించి.కూటమి పార్టీల్లో ఉత్సాహం నింపడంతో పాటు, వైసీపీ పై విమర్శలు చేస్తూ, కూటమిని గెలిపించాల్సిందిగా ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.
జగన్ ఈరోజు షెడ్యూల్
వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.ఈరోజు ఉదయం 10 గంటలకు కర్నూలు నగరం వైస్సార్ సర్కిల్ లోని ఎస్ వి కాంప్లెక్స్ రోడ్డులో నిర్వహించే సభకు హాజరవుతారు.ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు కళ్యాణదుర్గంలోని కొల్ల పురమ్మ టెంపుల్ రోడ్డులో జరిగే సభలో జగన్ పాల్గొంటారు.ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు రాజంపేట లోని కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభకు జగన్ హాజరవుతారు.
చంద్రబాబు ఈరోజు షెడ్యూల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) నేడు పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి లో ప్రజాగణం సభలో పాల్గొంటారు.ఆ తర్వాత విశాఖపట్నంలో ప్రజా గళం సభకు హాజరవుతారు.కురుపాంలో ఉదయం 11.30 గంటలకు సభకు వెళతారు.అక్కడ నుంచి చీపురుపల్లి వెళ్తారు.
అక్కడ ఎంపీడీవో కార్యాలయం దగ్గర రోడ్ షో లో పాల్గొంటారు.అనంతరం విశాఖలోని సీతంపేటలో సాయంత్రం ఎన్నికల సభకు చంద్రబాబు హాజరవుతారు.