హన్మకొండ జిల్లాలో వాల్ పోస్టర్ల కలకలం చెలరేగింది.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.
ఇందిరమ్మ ఇళ్లు కాజేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఉన్న వాల్ పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తుల పేరిట వెలిసిన ఘటన స్థానికంగా సంచనలంగా మారింది.
వాల్ పోస్టర్ల నేపథ్యంలో డీసీసీ ప్రెసిడెంట్ నాయిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పార్టీలోని కోవర్టులు, లోకల్ ఎమ్మెల్యే అనుచరులు పోస్టర్లు వేశారని ఆయన ఆరోపిస్తున్నారు.అనంతరం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నాయిని బ్రోకర్లు బతుకులు మార్చుకోండని చెప్పారు.
దమ్ముంటే మీ పేరుతో పోస్టర్లు వేయండి తేల్చుకుందామని తెలిపారు.పశ్చిమ నుంచి కచ్చితంగా పోటీ చేస్తానన్న నాయిని చూసుకుందామని సవాల్ విసిరారు.