అల్లూరి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.ప్రమాదవశాత్తు ఓ లారీ లోయలోకి దూసుకెళ్లింది.
మారేడుమిల్లి – చింతూరు మధ్య ఉన్న పాలమూరుగొంది టర్నింగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.
బాధితులు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వారిగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.