వ్యూస్ కోసం 4,600 ఫోన్లు కొన్న చైనా వ్యక్తి.. కట్ చేస్తే జైలు పాలయ్యాడు..

యూట్యూబ్‌లో కంటెంట్ పెట్టి డబ్బులు సంపాదించే వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువయ్యారు.యూట్యూబ్ నిబంధనల ప్రకారం కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబర్లు, ఏడాదిలో 4,000 గంటల వీడియో చూసే సమయం ఉంటే డబ్బులు సంపాదించే వీలుంటుంది.

 A Chinese Man Who Bought 4,600 Phones For Views Was Jailed If Cut, Youtubers, Vi-TeluguStop.com

కానీ, ఇటీవల చైనాలో( China ) జరిగిన ఘటన యూట్యూబ్‌ను కేటుగాళ్లు ఎలా మోసాలు చేస్తున్నారో తెలియజేసింది.

వాంగ్( Wang ) అనే ఒక చైనా వ్యక్తి తన యూట్యూబ్ ఛానెల్‌కి వచ్చే వ్యూస్ కౌంట్‌ను పెంచడానికి కృత్రిమ పద్ధతులు వాడాడు.దాదాపు 4,600 మొబైల్ ఫోన్లను ఉపయోగించి లైవ్ స్ట్రీమ్స్‌లో ఫేక్ వ్యూస్, లైక్‌లు, కామెంట్లు, షేర్‌లు పొందినట్లు చూపించాడు.‘బ్రషింగ్’( brushing ) అనే ఈ మోసంలో నిజమైన వ్యూయర్స్‌ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్నారని యూట్యూబ్‌ను నమ్మించవచ్చు.ఈ పద్ధతిలో వ్యూయర్స్‌ కౌంట్, లైక్స్‌, కామెంట్లు, షేర్లు అన్నీ కృత్రిమంగా పెంచుతారు.దీని వల్ల ఛానెల్ కి ఎక్కువ మంది వస్తారు, దాని ద్వారా డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతాయి.

Telugu Views Jailed, Chinese, China, Nri, Wang, Youtubes Policy, Youtubers-Telug

వాంగ్ చేసిన మోసం చాలా తెలివిగా ఉంది.అతడు వేలాది ఫోన్లు కొని, వాటిని నియంత్రించడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాడు.దీని ద్వారా ఒకేసారి కొన్ని క్లిక్‌లతో అన్ని పరికరాలను నిర్వహించగలిగాడు.మోసాన్ని సులభతరం చేయడానికి రౌటర్లు, VPN సేవలు, ఇతర నెట్‌వర్క్ పరికరాలను కూడా ఉపయోగించాడు.నాలుగు నెలల పాటు వాంగ్ ఈ పథకం ద్వారా 415,000 డాలర్లు (సుమారు రూ.3.4 కోట్లు) సంపాదించాడు.

Telugu Views Jailed, Chinese, China, Nri, Wang, Youtubes Policy, Youtubers-Telug

‘క్రిమినల్ బిజినెస్ యాక్టివిటీస్‌కు పాల్పడినందుకు వాంగ్‌పై ఒక సంవత్సరం మూడు నెలల జైలు శిక్ష, 7,000 డాలర్లు (రూ.5.84 లక్షలు) జరిమానా విధించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.2022లో ఒక స్నేహితుడు ‘బ్రషింగ్’ పద్ధతి గురించి చెప్పడంతో వాంగ్ ఈ మోసం చేయడం స్టార్ట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube