మహేష్‌బాబు హీరోగా సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకు కూడా విడుదలకు నోచుకోలేదు.
ఏప్రిల్‌కు వాయిదా పడ్డ ‘బ్రహ్మోత్సవం’ మేకు మారింది.ఇటీవలే మే మొదటి వారంలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని చివరి వారంకు వాయిదా వేశారు.
తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాను మళ్లీ వాయిదా వేస్తారట.మహేష్‌బాబును మే సెంటిమెంట్ భయపెడుతుందట.
అందుకే మే నుండి ఈ సినిమాను జూన్‌కు విడుదల తేదీని మార్చాలని భావిస్తున్నారు.
టాలీవుడ్‌లో సెంటిమెంట్లకు కొదువ లేదు.
ఎన్నో సెంటిమెంట్లు టాలీవుడ్‌లో రాజ్యం ఏుతున్నాయి.అందరి మాదిరిగానే మహేష్‌బాబు కూడా సెంటిమెంట్లను నమ్ముతాడు.
మహేష్‌బాబు గతంలో నటించిన ‘నిజం’ మరియు ‘నాని’ చిత్రాలు మే నెలలో విడుదల అయ్యాయి.ఆ సినిమా రెండు కూడా మహేష్‌కు చేదు అనుభవంను మిగిల్చాయి.
దాంతో మే నెల అంటే మహేష్‌బాబు కాస్త ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది.మే నెలలో ‘బ్రహ్మోత్సవం’ విడుదలపై ఆలోచనలో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.
సెంటిమెంట్‌కు మహేష్ భయపడితే ‘బ్రహ్మోత్సవం’ కోసం జూన్ వరకు ఆగాల్సిందే.