ఇదిగో గడ్డం తీసేసిన ‘సర్దార్‌’

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ గత కొంత కాలంగా గడ్డం జుట్టు భారీగా పెంచిన విషయం తెల్సిందే.పలువురు పలు రకాలుగా అనుకున్నా కూడా పవన్‌ తన గడ్డం, జుట్టును ఎందుకు పెంచుతున్నాడో అనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు.

 Pawan Kalyan New Look Without Bread-TeluguStop.com

ఎక్కువ శాతం ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ‘గబ్బర్‌సింగ్‌ 2’ కోసం పవన్‌ గడ్డం పెంచుతున్నాడు అనుకున్నారు.తాజాగా ‘గబ్బర్‌ సింగ్‌ 2’ కాస్త ‘సర్దార్‌’గా మారింది.

ఇటీవలే ఈ సినిమా రెగ్యుర్‌ చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.ప్రస్తుతం హైదరాబాద్‌లోని పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ శరవేంగా జరుగుతోంది.

చిత్ర దర్శకుడు బాబీ పుట్టిన రోజు సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ న్యూ లుక్‌ రివీల్‌ అయ్యింది.గత కొన్ని రోజులుగా గడ్డంతో కనిపించిన పవన్‌ తాజాగా నీట్‌ షేవ్‌తో కనిపించి ఆకట్టుకుంటున్నాడు.

గడ్డంతో చిరాకు తెప్పించిన పవన్‌ ఇప్పుడు స్మార్ట్‌గా ఉన్నాడు అంటూ ఆయన ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.అయితే ఇన్ని రోజులు గడ్డం పెంచింది ఎందుకో మాత్రం తెలియరాలేదు.

ఒకే వేల ఈ సినిమాలోనే గడ్డం సీన్స్‌ తెరకెక్కించారేమో, ఆ సీన్స్‌ పూర్తి అయిన తర్వాత గడ్డం తీసేశాడేమో అని కొందరు అంటున్నారు.అయితే సినిమా చిత్రీకరణ మొదలై రెండు మూడు రోజుల్లోనే గడ్డం సీన్స్‌ పూర్తి చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి ఏదైతే ఏం పవన్‌ గడ్డం తీసి ఇలా నీట్‌గా కనిపిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube