తనను వాడుతున్నారంటూ కాజల్‌ ఆగ్రహం

హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ షాపింగ్‌ మాల్‌పై ముద్దుగుమ్మ కాజల్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.తన అనుమతి లేకుండా తన ఫొటోలను మరియు వీడియోలను ఆ షాపింగ్‌ మాల్‌ ప్రచారం కోసం వినియోగించుకుందని లీగల్‌ నోటీస్‌ను పంపించింది.

 Kajal Aggarwal Filed Case On Shopping Mall-TeluguStop.com

షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కోసం తనను ఆహ్వానించిన సదరు షాపింగ్‌మాల్‌ యాజమాన్యం తనతో కాకుండా మరొకరితో ఆ మాల్‌ను ఓపెనింగ్‌ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.అందుకే తన ఫొటోలను వాడుకున్నందుకు వారిపై లీగల్‌ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లుగా కాజల్‌ చెప్పుకొచ్చింది.

సదరు షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం మాత్రం మరో రకం వాదన వినిపిస్తున్నారు.ముందుగా కాజల్‌ తమ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కు వస్తానని చెప్పి, ఆ తర్వాత అధిక పారితోషికం కోసం డిమాండ్‌ చేసిందని, దాంతో తాము అంత పారితోషికం ఇవ్వలేక మరో స్టార్‌తో తమ మాల్‌ను ఓపెనింగ్‌ చేయించాం తప్ప, ఆమె ఫొటోలను వాడుకోవాలనే ఉద్దేశ్యం తమకు లేదని చెబుతున్నారు.

కాజల్‌కు ముందుగా అడ్వాన్స్‌ ఇచ్చి ఉన్నాం కనుక, ఆమె ఫొటోలను పబ్లిసిటీ కోసం వాడామని షాపింగ్‌మాల్‌ ప్రకటించింది.మరి ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube