బాలయ్య ,బోయపాటి శ్రీను( Balayya, Boyapati Srinu ) కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కాగా ఇప్పటికే ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ఎంపికయ్యారని సమాచారం అందుతోంది.
డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్( Sanyukta Menon ) నటించగా ప్రస్తుతం అఖండ2 సినిమాలో సంయుక్త మీనన్ నటిస్తున్నారని తెలుస్తోంది.
బాలయ్య, సంయుక్త ఇప్పటికే ప్రముఖ జ్యూయలరీ సంస్థకు సంబంధించిన యాడ్ లో నటించగా ఆ యాడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.డైరెక్టర్ బోయపాటి శ్రీను తన సినిమాలలో హీరోయిన్లను ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో చూపిస్తారనే సంగతి తెలిసిందే.
అఖండ సీక్వెల్ లో సంయుక్త మీనన్ కు ఎలాంటి రోల్ దక్కుతుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సంయుక్తకు తెలుగులో ఆఫర్లు సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.దసరా పండుగ టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.నందమూరి హీరోలకు దసరా పండగ ఒకింత కలిసొచ్చిందని చెప్పవచ్చు.
అఖండ సీక్వెల్ ఫస్టాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సెకండాఫ్ బోనస్ అని థమన్ తాజాగా చేసిన కామెంట్లు ఒకింత హాట్ టాపిక్ అవుతున్నాయి.అఖండ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బాలయ్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల కలను ఈ సినిమా సులువుగానే నిజం చేసే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.