ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.6.02
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఆశ్లేష మంచిది మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ.2.48 ల3.36
మేషం:
ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
వాహనయోగం ఉన్నది.పనులలో అవాంతరాలు అధిగమిస్తారు.
వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
వృషభం:
ఈరోజు ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది
మిథునం:
ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి.
ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు.
వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.
కర్కాటకం:
ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.
సింహం:
ఈరోజు చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.
కన్య:
ఈరోజు చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు.
కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి.ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.
తుల:
ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి శిరోభాధలు కలుగుతాయి.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.
వృశ్చికం:
ఈరోజు కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.
ధనుస్సు:
ఈరోజు బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి.
మకరం:
ఈరోజు కుటుంబ సభ్యుల నుండి అవసరానికి తన సహాయం అందుతుంది.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.భూ సంభందిత క్రయ విక్రయాల కలసివస్తాయి.వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.
కుంభం:
ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు కలుగుతాయి.రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది.ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.
కుటుంబమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
మీనం:
ఈరోజు బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి.