చలికాలంలో చేతులు పొడిబారకుండా మృదువుగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!

మనలో చాలా మంది ముఖంపై పెట్టే శ్రద్ధ చేతులపై పెట్టరు.ప్రస్తుత చలికాలంలో( Winter ) పొడి గాలి, తేమ తక్కువగా ఉండడం, వేడి వేడి నీటితో స్నానం చేయడం, మాయిశ్చరైజర్స్ వాడకపోవడం తదితర కారణాల వల్ల చేతులు పొడిబారి( Dry Hands ) నిర్జీవంగా మారుతుంటాయి.

 Follow These Tips To Avoid Dry Hands In Winter Details, Winter, Dry Skin, Dry Ha-TeluguStop.com

దురద కూడా పెడుతుంటాయి.అయితే పొడిబారిన చేతులను రిపేర్ చేయడానికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ చాలా బాగా సహాయపడతాయి.

టిప్ -1:

ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును( Curd ) వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు,( Organic Turmeric ) వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు చేతులకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై తడి క్లాత్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే పొడిబారిన చేతులు మృదువుగా మారుతాయి.అందంగా మెరుస్తాయి.

Telugu Tips, Coconut Oil, Curd, Dry, Dry Skin, Healthy Skin, Honey, Latest, Simp

టిప్ -2:

ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) మరియు రెండు టేబుల్ స్పూన్లు తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.15 నిమిషాల అనంతరం శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ టిప్ ను పాటించినా కూడా వింట‌ర్ లో హాండ్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి.

స్మూత్ అండ్ షైనీ గా మెరుస్తాయి.

Telugu Tips, Coconut Oil, Curd, Dry, Dry Skin, Healthy Skin, Honey, Latest, Simp

టిప్ – 3:

ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని రెండు నిమిషాల పాటు మిక్స్ చేస్తే మంచి క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ప్ర‌తిరోజూ ఉదయం సాయంత్రం చేతులకు అప్లై చేసుకోవాలి.చలికాలంలో చేతులు పొడిబారకుండా ఉండాలన్నా, మృదువుగా మెరిసిపోతూ కనిపించాలన్నా ఈ క్రీమ్ ను ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube