చలికాలంలో చేతులు పొడిబారకుండా మృదువుగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!
TeluguStop.com
మనలో చాలా మంది ముఖంపై పెట్టే శ్రద్ధ చేతులపై పెట్టరు.ప్రస్తుత చలికాలంలో( Winter ) పొడి గాలి, తేమ తక్కువగా ఉండడం, వేడి వేడి నీటితో స్నానం చేయడం, మాయిశ్చరైజర్స్ వాడకపోవడం తదితర కారణాల వల్ల చేతులు పొడిబారి( Dry Hands ) నిర్జీవంగా మారుతుంటాయి.
దురద కూడా పెడుతుంటాయి.అయితే పొడిబారిన చేతులను రిపేర్ చేయడానికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ చాలా బాగా సహాయపడతాయి.
H3 Class=subheader-styleటిప్ -1:/h3p ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును( Curd ) వేసుకోవాలి.
అలాగే పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు,( Organic Turmeric ) వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు చేతులకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఆపై తడి క్లాత్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే పొడిబారిన చేతులు మృదువుగా మారుతాయి.
అందంగా మెరుస్తాయి. """/" /
H3 Class=subheader-styleటిప్ -2:/h3p ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) మరియు రెండు టేబుల్ స్పూన్లు తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.15 నిమిషాల అనంతరం శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఈ సింపుల్ టిప్ ను పాటించినా కూడా వింటర్ లో హాండ్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి.
స్మూత్ అండ్ షైనీ గా మెరుస్తాయి. """/" /
H3 Class=subheader-styleటిప్ - 3:/h3p ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని రెండు నిమిషాల పాటు మిక్స్ చేస్తే మంచి క్రీమ్ రెడీ అవుతుంది.
ఈ క్రీమ్ ను ప్రతిరోజూ ఉదయం సాయంత్రం చేతులకు అప్లై చేసుకోవాలి.చలికాలంలో చేతులు పొడిబారకుండా ఉండాలన్నా, మృదువుగా మెరిసిపోతూ కనిపించాలన్నా ఈ క్రీమ్ ను ప్రయత్నించండి.
రాముడిలా కనిపించేవాళ్లు రావణుడిలా కనిపించకూడదు.. ముఖేష్ కన్నా కామెంట్స్ వైరల్!