కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదేనా ? మూల్యం తప్పదా ?

కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా పేరు పొందిన మంత్రి కొండా సురేఖ( Minister Konda Surekha ) రాజకీయ భవిష్యత్ ప్రస్తుతం గందరగోళంలో పడింది.వరుస వరుసగా వివాదాలు ఆమెను చుట్టుముడుతుండడంతో,  అయోమయంలో ఉన్నారు.

 Telangana Congress Minister Konda Surekha Controversies Details, Konda Surekha,-TeluguStop.com

పార్టీ అధిష్టానం కూడా కొండ సురేఖ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో ఆమెపై చర్యలు తప్పేలా కనిపించడం లేదు.ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ పై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దృష్టి సారించారు.

ఇప్పటికే అధిష్టానం పెద్దలను కలిశారు.కొంతమంది మంత్రులను తప్పించి , మరి కొంతమందికి అవకాశం కల్పించి పూర్తిస్థాయిలో క్యాబినెట్ ఏర్పాటు చేసుకునే పనుల్లో రేవంత్ రెడ్డి నిమగ్నం అయ్యారు.

అయితే ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళనలో కొండా సురేఖ పదవికి గండం ఏర్పడబోతుందనే ప్రచారం జరుగుతోంది.మంత్రి పదవిలో ఉన్న సురేఖ ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తుండడం వల్లే ఆమెకు ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లో ఉంది 

Telugu Konda Surekha, Kondasurekha, Revanth Reddy, Samantha, Telangana Cm, Telan

వరంగల్ జిల్లాలోని తన నియోజకవర్గానికే పరిమితం కావలసిన సురేఖ అన్ని నియోజకవర్గాల్లోని వ్యవహారాల పైన కలుగజేసుకొండడం , దీని కారణంగా అక్కడి స్థానిక ఎమ్మెల్యేలు తో విభేదాలు ఏర్పడడం ,వారు ఈ విషయమై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తుండడం వంటివి కొండా సురేఖకు ఇబ్బందికరంగా మారాయి.  కొండా సురేఖతో పాటు,  ఆమె భర్త కొండ మురళికి( Konda Murali ) ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనుచరులు ఉన్నారు.  వారిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేలను కూడా లెక్కచేయకుండా జిల్లా అంతటా ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తూ ఉండడంతో ,

Telugu Konda Surekha, Kondasurekha, Revanth Reddy, Samantha, Telangana Cm, Telan

ఆమెకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.అంతకుముందే అక్కినేని కుటుంబం వివాదంలోనూ సురేఖ చిక్కుకున్నారు.సమంతా ,( Samantha ) నాగచైతన్య( Naga Chaitanya ) విడిపోవడానికి కేటీఆర్( KTR ) కారణమంటూ కొండా  సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

కొండా సురేఖ వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అంతా తప్పు పట్టారు.హీరోల అభిమానులు కూడా కొండా సురేఖ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటు,  ఆందోళనకు దిగారు.

ఇక అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) కొండ సురేఖ పై  పరువు నష్టం దావా వేశారు .అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పరువు నష్టం దావా వేశారు.ఈ వ్యవహారాలన్నీ కొండా సురేఖకు ఇబ్బందులే తెచ్చిపెట్టాయి.

Telugu Konda Surekha, Kondasurekha, Revanth Reddy, Samantha, Telangana Cm, Telan

ఆ వ్యవహారం తర్వాత తన పాత నియోజకవర్గమైన పరకాల లో పోలీస్ స్టేషన్ లో సిఐ కుర్చీలో కూర్చుని చేసిన హడావుడి  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది .సొంత పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సైతం ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  పరకాల నియోజకవర్గంలో ఫ్లెక్సీలు చించివేత కేసులో కొండా అనుచరులు అరెస్టు కావడంతో,  ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారిని విడిపించే ప్రయత్నంలో చేసిన హడావుడి వివాదాస్పదం అయింది .ఇక వరంగల్ పశ్చిమ , వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్ పూర్, నర్సంపేట, భూపాలపల్లి, వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఆమెపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం కావడం,  కేసి వేణుగోపాల్ అపాయింట్మెంట్ ను కోరినట్లుగా ప్రచారం జరిగింది  అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారించడం తో ఆ  ప్రయత్నాన్ని విరమించుకున్నారట.ఇలా సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కొండా సురేఖ కు మంత్రి పదవితో పాటు , రాజకీయ భవిష్యత్ పైన నీలి నీడలు కమ్ముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube