తరచుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.ముఖ్యంగా పులులు, సింహాలు, చిరుతపులులు( Tigers, lions, leopards ) వంటి వన్యప్రాణుల వీడియోలు.
వాటి అరుదైన వీడియోలను చూడటం సరదాగా ఉంటుంది.అడవికి రాజు సింహం.
ఇది అందరికి తెలిసిందే.అడవిలో నివసించే ప్రతి జంతువును వేటాడి తినే పవర్ సింహం సొంతం.
ఇకపోతే తాజాగా అడవి జంతువులకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఈ వీడియోలో సింహాల మంద, జిరాఫీ మధ్య జరిగిన పోరు గురించి.
ఇంతకు ముందు చెప్పినట్లుగా, సింహం చాలా శక్తివంతమైన జంతువు.ఎంత బలిష్టమైన జంతువు అయినా సమయస్ఫూర్తి సరిగా లేనప్పుడు చిన్న చీమ చేతిలో కూడా ఓడిపోతుంది.ఈ వైరల్ వీడియో ఇందుకు ఉదాహరణ.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, సింహాల గుంపు ఒంటరిగా ఉన్న జిరాఫీపై దాడి చేసింది .కొన్ని ఆడ సింహాలు వెనుక నుండి దాడి చేస్తాయి.మొదట ఈ జిరాఫీ కథ ముగిసినట్లే అనిపించింది.
అయితే, సింహల నుండి జిరాఫీ( Giraffe ) ఒంటరిగా తిప్పికొడుతుంది.ఈ విధంగా జిరాఫీ పిల్ల కూడా రక్షించబడుతుంది.వీడియోలో జిరాఫీ వెనుక కాళ్ళు మాత్రమే పని చేయడం గమనించవచ్చు.సింహాలు జిరాఫీ ఒక్క కాలు కిక్‌తో చాలా దూరం వెళ్లి పడిపోతాయి.కొన్ని సెకన్ల ఈ వీడియోలో అనేక సింహాల నుండి జిరాఫీ ఎలా తపించుకుందో కనపడుతుంది.ఈ వీడియోలో సింహాల పరిస్థితి చూస్తే జిరాఫీకి ఎంత బలం ఉందో అంచనా వేయవచ్చు.
సాధారణంగా సింహాలు తమ ఎరను సులభంగా ఓడిస్తాయి.కానీ.
, ఈసారి అవి పారిపోవాల్సి వచ్చింది.ఇక ఈ వీడియోను చుసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు.