జమ్మూకాశ్మీర్ ఎన్నికలు : పదేళ్ల తరువాత ప్రారంభమైన పోలింగ్ 

దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ( Jammu and Kashmir )అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది.తొలి విడత పోలింగ్ నేడు ప్రారంభం అయ్యింది.

 Jammu And Kashmir Elections Are The First Polling After Ten Years, Bjp, Jammu Ka-TeluguStop.com

పదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ పైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఆర్టికల్ 370 రద్దు,  ప్రత్యేక రాష్ట్ర హోదా తరువాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో, అందరి దృష్టి ఎన్నికలపైనే ఉంది.

ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

  జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా,  మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Telugu Congress, Jammu Kashmir-Politics

మొదటి విడతలో భాగంగా 24 స్థానాలకు నేడు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది.సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్  కొనసాగనుంది.24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.23 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఇక ఎన్నికల్లో గెలుపు పై అని పార్టీలు ధీమాగానే ఉన్నాయి.

ముఖ్యంగా బిజెపి ( BJP )ఈ ఎన్నికల్లో తమదే గెలుపు అనే నమ్మకంతో ఉంది.  మారాజ్ రీజియన్ లోని అనంత్నాథ్ పుల్వామా పుల్కామ్ సోఫియాన్ జిల్లాలు , చీనాబ్ లోయలోని డోరా కిస్తీ, వార్డ్ రాంబన్ జిల్లాలో పోలింగ్ జరిగే జాబితాలో ఉన్నాయి.

బిజెపి నేషనల్ కాన్ఫరెన్స్ ( ఎన్సి) , పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ( People’s Democratic Party )( పిడిపి ,), ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి .ఎన్సీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది.

Telugu Congress, Jammu Kashmir-Politics

మొదటి విడత పోలింగ్ ప్రక్రియ నేటితో ముగియగా, 25వ తేదీన రెండో విడత,  అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.  అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు.ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర హోదా కల్పిస్తామని అని పార్టీలు హామీ ఇస్తున్నాయి.  బిజెపి,  కాంగ్రెస్ లు కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర హోదాను కల్పిస్తామని చెబుతున్నాయి.

దీంతో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిస్తారు అనేది త్వరలోనే తేలనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube