మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడేవారుమనోధైర్యంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.ఆత్మహత్యల నివారణ దినం సందర్బంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో టోల్ ఫ్రీ నెంబర్ 14416 పోస్టర్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్( Collector Sandeep Kumar Jha, SP Akhil Mahajan ), డీఎంహెచ్ఓ వసంతరావు తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.

 Go Ahead With Courage: Collector Sandeep Kumar Jha, Collector Sandeep Kumar Jha,-TeluguStop.com

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించి ఆత్మ హత్యల నివారణ గురించి అవగాహన కల్పించాలని, యువత, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

మానసిక సమస్యలకు చికిత్స తీసుకునే కంటే వీటిని దాచి పెట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తారని, ఈ  సమస్యపై మాట్లాడేందుకు చాలా మంది ఇష్టపడరని వివరించారు.జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మానసిక కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, చికిత్స పూర్తిగా ఉచితముగా అందిస్తామని, వారియొక్క వివరాలు గోప్యముగా ఉంటాయని స్పష్టం చేశారు.

ఆత్మహత్యలను అడ్డుకోవడంలో టెలీమానాస్ (టోల్ ఫ్రీ నెంబర్ 14416) 24X7 సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ సేవలను ప్రజలు వియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వైద్యుల  సూచన మేరకు సూచించిన మోతాదులో మందులు వాడితే ఆత్మ హత్యలు నివారించ బడుతాయని అన్నారు, సమాజం, చుట్టూ ప్రక్కల వారు ఆత్మ న్యూనత భావనతో ఉన్న వారికి చేయూత ఇవ్వాలని, అవగాహనతో మెలగాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా మానసిక వైద్య నిపుణులు ప్రవీణ్ కుమార్, డాక్టర్ నయీమా జహా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube