భారత సంతతి బాలుడి ప్రతిభ.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాంటెస్టెంట్‌లో గోల్డ్ మెడల్

అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆశిష్ గోయెల్ కుమారుడు, భారత సంతతికి చెందిన అగస్త్య గోయెల్ ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ఫర్మేటిక్స్‌లో (ఐఓఐ)( International Olympiad in Informatics ) గోల్డ్ మెడల్ సాధించారు.ఇది ఆయన కెరీర్‌లో రెండోది.

 Indian Origin Boy From Us Secures Gold Medal At World’s Toughest Programming-TeluguStop.com

ప్రపంచంలోనే హైస్కూల్ విద్యార్ధులకు నిర్వహించే అత్యంత కఠినమైన ప్రోగ్రామింగ్ పోటీగా పరిగణించే కాంటెస్ట్‌లో గోయల్ నాల్గవ ర్యాంక్ సాధించాడు.

Telugu Agastya Goel, America, Ashish Goel, Calinia, Profashish-Telugu NRI

36వ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మేటిక్స్‌ ఈ ఏడాది ఈజిప్ట్‌( Egypt )లో జరిగింది.ప్రోగ్రామింగ్ కాంటెస్ట్‌లో అగస్త్య గోయెల్ 600కి 438.97 స్కోర్‌తో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.చైనాకు చెందిన కాంగ్యాంగ్ జౌ 600కి 600 సాధించి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు.ఈ ఏడాది జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ఫర్మేటిక్స్‌లో మొత్తం 34 మంది విద్యార్ధులు గోల్డ్ మెడల్ సాధించారు.

వీరిలో భారత్‌కు చెందిన క్షితిజ్ సోదానీ (21వ ర్యాంక్) కూడా ఉన్నారు.

Telugu Agastya Goel, America, Ashish Goel, Calinia, Profashish-Telugu NRI

కాలిఫోర్నియా( California )కు చెందిన అగస్త్య గోయెల్‌ తండ్రి ఆశిష్ గోయెల్( Ashish Goel ) 1990లో ఐఐటీ జేఈఈ పరీక్షలో నెంబర్‌వన్‌గా నిలిచారు.ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన ఆయన 1994లో ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టభద్రుడయ్యాడు.తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు.అనంతరం ట్విట్టర్, స్ట్రైప్ వంటి సంస్థలలోనూ పలు హోదాలలో పనిచేశారు.స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్‌గానూ సేవలందించారు.కంప్యూటర్ నెట్‌వర్క్స్, థియెరాటికల్ కంప్యూటర్ సైన్స్, మాలిక్యూలర్ సెల్ఫ్ అసెంబ్లీ, కంప్యూటేషనల్ సోషల్ ఛాయిస్‌లోనూ ఆశిష్ గోయెల్ పరిశోధనలు చేశారు.

ఇకపోతే.ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మేటిక్స్‌ (ఐఏఐ) అనేది వార్షిక ప్రోగ్రామింగ్ కాంటెస్ట్.

ఇది అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్‌లలో ఒకటి.దీనిని 1989లో యునెస్కో ప్రారంభించింది.

రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలలో కంటెస్టెంట్స్ వారి కంప్యూటర్ ప్రోగ్రామింగ్/ కోడింగ్ నైపుణ్యాలను, అల్గారిథమిక్ నేచర్‌, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube