ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నా కూడా అనుకోని సంఘటన వల్ల మనకే తీరని నష్టం మిగిలిస్తుంది.అతి వేగం ప్రమాదకరం అని అన్నారు పెద్దలు.
అందుకు తగ్గట్టుగానే చాలా మంది రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బైక్స్ లేదా స్కూటీ లను నడిపే సమయంలో స్పీడ్ లిమిట్ లో చాలా అదుపులో ఉంటారు.కానీ కొంతమంది చేసే పనుల వల్ల జాగ్రత్తగా వెళ్తున్న వారికి కూడా ప్రమాదాలు( Accidents ) సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో.
ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి.
అచ్చం అలాంటి సంఘటన ఒకటి హప్సిగూడలో( Habsiguda ) చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.హబ్సిగూడలో స్థానిక సమాచారం మేరకు జూన్సన్ గ్రామర్ స్కూల్లో ఆరో చదివితే చదువుతున్న విద్యార్థి( Student ) పాఠశాల నుండి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ( Truck ) ఢీకొట్టింది.
ఈ తరుణంలో లారీ వెనుక చక్రాలు ఆ అమ్మాయిపై వెళ్లడంతో ఆ చిన్నారి మృతి చెందింది.ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అక్కడి నుంచి లారీ డ్రైవర్ పరాడు అయ్యాడు.
ప్రమాదం జరిగిన వెంటనే వాహనాదారులు బాలికలు రక్షించేందుకు ఆస్పత్రికి తరలించగా .ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది.ఈ ప్రమాదం పై సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దాని విచారణ మొదలుపెట్టేశారు.అయితే., నో ఎంట్రీ సమయంలో సిటీ లోకి లారీలు ఎలా తిరుగుతున్నాయని.ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని.? పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇక మరోవైపు పాప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆ చిన్నారి తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.