లడఖ్ పరిసరాల్లో తెలివిగా దాక్కున్న మంచు చిరుతలు.. వీడియో చూస్తే..?

ఈ భూ ప్రపంచంపై ఎన్నో అందమైన జీవులు ఉన్నాయి కొన్ని అత్యంత భారీ శరీరాలతో మనల్ని అబ్బురపరుస్తుంటాయి అయితే అనేక కారణాలవల్ల ఇవి అంతరించిపోతున్నాయి.వాటిలో మంచు చిరుత పులులు కూడా ఉన్నాయి.

 Snow Leopards Cleverly Hiding In The Surroundings Of Ladakh If You See The Vide-TeluguStop.com

ప్రపంచంలో మొత్తం 4,080 నుంచి 6,590 మాత్రమే మంచు చిరుతలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.అంటే ఒక్కొక్క దేశంలో సగటున కనీసం 30 చిరుతలకు కూడా లేవని చెప్పుకోవచ్చు.

అవి ఎక్కడ దాగున్నాయో తెలియదు కాబట్టి, వాటిని చూడటం అంటే చాలా అదృష్టం.అలాంటిది ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌కు ఏకంగా మూడు మంచు చిరుతపులలు( Leopards ) ఒకేసారి కనిపించాయి.

మూరుప్ నంగైల్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఒకటి కాదు, మూడు స్నో లెపర్డ్‌లు కలిసి కొండల్లో తిరుగుతున్న అరుదైన అందమైన దృశ్యం కనిపించింది.

అంత అరుదైన జంతువులను ఒకేసారి చూపించే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.వీడియో క్లిప్‌లో లడఖ్‌లోని చదునైన భూభాగం మీదుగా ఈ మంచు చిరుతపులులు నడుస్తున్నట్లు కనిపించింది, వాటి వేటలో తల్లి కూడా చేరింది.

అవి పరిసరాల్లో బాగా కలిసిపోయాయి.

నామ్‌గైల్ ఇది గత చలికాలంలో తీసిన వీడియో అని పేర్కొన్నాడు, “చాలా బ్రేక్‌ తర్వాత, నేను పాస్ట్ వింటర్ సీజన్ నుంచి ఒక అద్భుత క్షణాన్ని పంచుకుంటున్నాను.ఒక తల్లి మంచు చిరుత, ఆమె రెండు పిల్లలు వేటాడేందుకు వెళుతున్నాయి.” అని దీనికి క్యాప్షన్ జోడించారు.ఈ చిరుతలను జీవితంలో ఒక్కసారి చూడటమే అదృష్టం.అలాంటివి మూడు కలిసి కనిపించడం అంటే చాలా అద్భుతం.ఇవి చిరుత కుటుంబంలో అత్యంత అందమైన జంతువులు అని కొందరు అంటున్నారు.ఇలాంటి దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుందని మరొకరు అంటున్నారు.

చిరుతలను ‘మౌంటైన్ ఘోస్ట్( Mountain Ghost )’ అని కూడా అంటారు.ఎందుకంటే వీటిని చూడటం చాలా కష్టం.ఇవి చాలా జాగ్రత్తగా ఉంటాయి.వీటి శరీరం మీద ఉన్న రంగులు పొదలు, రాళ్ల రంగుల్లా ఉంటాయి.దీని వల్ల ఇవి కనిపించకుండా ఉంటాయి.మన దేశంలో, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో మంచు చిరుతలు ఉన్నాయి.

కానీ వీటిని చూడటం చాలా అరుదు.వాతావరణం మారుతున్నందువల్ల ఈ చిరుతలు నివసించే ప్రాంతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube