అధిక రక్తపోటు లేదా హై బీపీ.చాలా మందిని కలవరపెట్టే సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఇది ఒకటి.
అధిక రక్తపోటు కారణంగా తలనొప్పి, మైకం, ముక్కు నుంచి రక్తం కారడం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దృష్టి సమస్యలు, అలసట, దడ వంటివి తలెత్తుతాయి.ఈ లక్షణాలతో అధిక రక్తపోటును ముందుగానే గ్రహిస్తే మందులతో పని లేకుండా జీవన శైలిలో పలు మార్పులు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు.
హై బీపీ( High BP ) నార్మల్ కావాలంటే మొదట ఉప్పు తీసుకోవడం బాగా తగ్గించాలి.ఉప్పుకు బదులు వంటల్లో ఇతర మసాలాలు, హెర్బల్స్ ను జోడించండి.
అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోండి.హైట్ కు సరిపడా వెయిట్ మెయింటైన్ చేయండి.
ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకోండి.
బాడీకి రెగ్యులర్ గా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి.అందుకోసం నిత్యం వ్యాయామం చేయండి.వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి ఎంచుకోండి.
ధూమపానం మానేయడం మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.మరియు రక్తపోటును తగ్గిస్తుంది.అలాగే ఒత్తిడి( Stress )ని తగ్గించుకోండి.ఒత్తిడి, టెన్షన్ కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం మరియు పాటలు వినడం చేయండి.యోగా, ధ్యానం మరియు లోతైన శ్వాస వ్యాయామాలు వంటి పద్ధతులు కూడా ఒత్తిడి స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.
ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వల్ల రక్తపోటు పెరుగుతుంది.కాబట్టి అటువంటి ఆహారాలకు దూరంగా ఉండండి. కొవ్వు అధికంగా ఉండే ఆహారాల జోలికి అసలు పోవద్దు.
కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ ను ఉంచుకోండి.అరటి, బత్తాయి, ద్రాక్ష, కివి, గ్రేప్స్, దానిమ్మ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోండి.
జీవన శైలిలో ఇటువంటి మార్పులను చేసుకోవడం వల్ల మందులతో పని లేకుండానే హై బీపీని నార్మల్ చేసుకోవచ్చు.