వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది.
అలాగే వర్షాకాలంలో సన్ లైట్ తక్కువగా ఉండటం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది.రోగ నిరోధక వ్యవస్థ సైతం దెబ్బతింటుంది.
ఫలితంగా వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.వాటికి చెక్ పెట్టి వర్షాకాలంలో ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే కచ్చితంగా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
బయట ఆహారాన్ని పూర్తిగా నివారించాలి.హోమ్ ఫుడ్ ను ప్రిఫర్ చేయాలి.
వర్షకాలమైనా సరే బద్దకించకుండా రోజుకు అరగంట వ్యాయామం( Exercise ) చేయాలి.ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ( Herbal tea ) వర్షాకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.వివిధ రోగాలకు అడ్డుకట్ట వేస్తుంది.మరి ఇంతకీ ఆ హెర్బల్ టీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు, వన్ టేబుల్ స్పూన్ వాము, వన్ టేబుల్ స్పూన్ సోంపు, అంగుళం దాల్చిన చెక్క, అర టీ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పదార్థాలు అన్నిటినీ వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ హెర్బల్ టీ పౌడర్ ను ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడిని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై స్టైనర్ సహాయంతో మన హెర్బల్ టీ ని ఫిల్టర్ చేసుకుని రుచికి సరిపడా తేనె కలిపి సేవించాలి.
ప్రస్తుత వర్షాకాలంలో రెగ్యులర్ గా ఈ హెర్బల్ టీను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ( Immune system ) బలపడుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సీజనల్ సమస్యలు పరారవుతాయి.అలాగే ఈ హెర్బల్ టీ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
జాయింట్ పెయిన్స్ ను దూరం చేస్తుంది.ఒత్తిడి నుంచి రిలీఫ్ ను అందిస్తుంది.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.మరియు పొట్ట కొవ్వును కరిగించడానికి కూడా ఈ హెర్బల్ టీ అద్భుతంగా తోడ్పడుతుంది.