పల్లె ప్రకృతిలో బర్ల మంద

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ(Yellareddypet )ల కేంద్రంలో పల్లె ప్రకృతి వనం(Palleprakruthi Vanam.) వికృతంగా మారిన సంఘటన గత కొన్ని మాసాలుగా కొనసాగుతుంది వివరాలోకి వెళ్తే.

 Buffaloes In Palleprakruthi Vanam At Yellareddypet, Palleprakruthi Vanam, Yella-TeluguStop.com

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పల్లె ప్రకృతి వనం సుందరీ కరణ పనులు జరిగాయి , నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుండి ఇప్పటివరకు పల్లె ప్రకృతి వనాన్ని ప్రజాప్రతినిధులు గానీ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు ప్రవేశ గేటు విరిగిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ తీరును గమనిస్తే పల్లె ప్రకృతికి అన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఓపెన్ జిమ్ పరికరాలు విరిగాయి అంతేకాకుండా సమీపంలో ఉన్న గిద్ద చెరువు బర్ల మంద పల్లె ప్రకృతి వనంలోకి వస్తున్నాయి గేదెలు , బర్లు రావడంతో పేడ వేస్తున్నాయి వేయడం వలన పల్లె ప్రకృతికి వచ్చే పర్యటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు , ఉదయం సాయంత్రం వేళలో వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు.

అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్త పడాలని అధికారులు స్పందించి పల్లె ప్రకృతి ప్రవేశద్వారాన్ని , ఓపెన్ జిమ్ పరికరాలను మరమ్మత్తులు చెయ్యాలని ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube